కన్నీటి వీడ్కోలు

10 Mar, 2018 07:26 IST|Sakshi
శావణి , భార్గవి పటేల్‌ , విషాదంలో భార్గవి పటేల్‌ కుటుంబ సభ్యులు

భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినుల అంత్యక్రియలు పూర్తి

మృతిపై సందిగ్ధత  

విచారణ చేపట్టాలి: బాలల హక్కుల సంఘం

నాగోలు: ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టీఎన్‌ఆర్‌ వైష్ణవి శిఖర అపార్ట్‌మెంట్స్‌ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు విద్యార్థినుల అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయి. వైష్ణవి శిఖర అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న భార్గవిపటేల్‌ చిత్రాలేఅవుట్‌లోని మంజీరా హైట్స్‌ ఫేజ్‌–1కు చెందిన కాలె సావని సాగర్‌రింగురోడ్డు సమీపంలోని అక్షర టెక్నో స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం రాత్రి వీరు ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు అందజేశారు. భార్గవిపటేల్‌ అంత్యక్రియలు వీవీనగర్‌ స్మశానవాటికలో నిర్వహించగా, సావని అంత్యక్రియలు అంబర్‌పేటలోని స్మశాన వాటికలో జరిగాయి. కాగా సావని మృతి చెందిన గంటలోపే ఆమె ఫేస్‌బుక్‌ ఐడీ నుంచి ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని తొలగించడం పట్ల ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేపట్టారు.

ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి: బాలల హక్కుల సంఘం
విద్యార్థినుల ఆత్మహత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు అన్ని సమకూర్చితే సరిపోదని వారితో కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. విద్యాసంస్థలు పిల్లలను మార్కులు, ర్యాంకుల కోసం వేధించకుండా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యాసంస్థలో మానసిక శాస్త్ర నిపుణులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు