అమ్మకం వెనుక అసలు కథేంటి?

18 Jun, 2019 12:32 IST|Sakshi
శిశువును అమ్మకానికి తీసుకొచ్చిన గంగజ్యోతి, ఆమె కూతురు, శిశువు 

విక్రయానికి తెచ్చింది తల్లి కాదనే అనుమానాలు

శిశువు మాబిడ్డేనంటూ అధికారులను సంప్రదించిన దంపతులు

డీఎన్‌ఏ పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగింత

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో ముక్కుపచ్చలారని పసికందును అమ్మకానికి సిద్ధపడ్డ ఘటన మలుపులు తిరుగుతోంది. శిశువును అమ్మేందుకు తీసుకొచ్చిన మహిళ శిశువు తల్లికాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్‌ జిల్లా కడెంకు చెందిన పుట్ట గంగజ్యోతికి మహారాష్ట్రకు చెందిన నవీన్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వివాహ అనంతరం వీరు ఆర్మూర్‌లోని బస్టాండ్‌ సమీపంలో నివాసం ఉంటున్నారు. నవీన్‌ స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఒక కూతురు స్నేహ (4) ఉంది. కొన్ని రోజుల క్రితం భర్త నవీన్‌ గంగజ్యోతిని విడిచి వెళ్లిపోయాడు. దీంతో జ్యోతి యాచిస్తూ జీవనం గడుపుతోంది. ఆదివారం ఉదయం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో నెలరోజులు కూడా నిండని పసికందును రూ.20 వేలకు అమ్మకానికి పెట్టింది. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు.

శిశువు జననం గురించి వివరాలు అడిగితే జ్యోతి పొంతనలేని సమాధానాలు చెబుతోంది. శిశువు బహిరంగ ప్రదేశంలో జన్మించిందని ఒకసారి, ఇంట్లోనే జన్మించిందని మరోసారి చెబుతుండటంతో జ్యోతి ఆ శిశువుకు తల్లి కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిశువుకు నెల రోజుల వయస్సు ఉంటుందని జ్యోతి చెబుతుండగా పరీక్షించిన వైద్యులు 11 రోజుల వయస్సుగా నిర్ధారించారు. ఇంతలో ఐసీడీఎస్‌ అధికారుల ఆధీనంలో ఉన్న శిశువు తమ బిడ్డేనం టూ ఆర్మూర్‌కు చెందిన దంపతులు అధికారులను సం ప్రదించినట్లు తెలిసింది. అధికారులు మాత్రం డీఎన్‌ఏ పరీక్షల అనంతరం శిశువు తల్లిదండ్రుల నిర్ధారణ తర్వాతే వారికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అంత వరకు పసికందును కరీంనగర్‌లోని శిశుగృహ సంరక్షణ కేంద్రానికి, అలాగే జ్యోతి, తన కూతురు స్నేహ(4)ను స్వధార్‌ కేంద్రానికి తరలించారు. ఐసీడీఎస్‌ మెట్‌పల్లి సీడీపీవో తిరుమలదేవి, ధర్మపురి సీడీపీవో అరుణ, జిల్లా చైల్డ్‌ డెవలప్‌మెంట్, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ హరీశ్‌ ఉన్నారు.

పాప కిడ్నాప్‌పై కేసు
మెట్‌పల్లిలో అమ్మకానికి పెట్టిన పాప కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామానికి చెందిన గందం సుమలత ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో తన 15 రోజుల పాపను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని సోమవారం ఫిర్యాదు చేసింది. ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కాగా పాప అమ్మకానికి పెట్టిన గంగజ్యోతి కూడా తనది ఆర్మూర్‌ అని చెప్పడంతోపాటు ఐసీడీఎస్‌ అధికారులకు అనుమానాలు కలుగుతున్నాయి. వారి వద్దనున్న పాప, కిడ్నాప్‌ అయిందన్న పాప ఫొటోలు ఒకేలా ఉండటంతో ఆర్మూర్‌కు చెందిన సుమలత కూతురుగానే భావిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’