సూట్‌కేసులో డెడ్‌బాడీ.. ముక్కలు ముక్కలుగా నరికి..

3 Dec, 2019 15:43 IST|Sakshi

ముంబై : నగరంలో దారుణం చేటు చేసుకుంది. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు, అతని మృత దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కేసులో కుక్కారు. ఆ సూట్‌కేసును మహీమ్‌ బీచ్‌లోని మఖ్దూమ్ షా బాబా దర్గా సమీపంలో పడేశారు. సోమవారం సాయంత్రం బీచ్‌లో నీటిపై తేలియాడుతున్న సూట్‌కేసును గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని సూట్‌కేసును తెరచిచూస్తే అందులో మృతదేహం శరీర భాగాలు కనిపించాయి. చేతులు, కాళ్లతో పాటు మర్మాంగాలు ఉండడంతో పోలీసులు షాక్ తిన్నారు. అవి ఎవరివి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల కోసం మృతదేహం భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.

సూట్ కేసు లభించిన చుట్టు పక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముంబైలో ఇటీవల నమోదైన మిస్సింగ్ కేసును కూడా పరిగణలోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్యక్తిని ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి, శరీర భాగాలను సూట్ కేసులో పెట్టి సముద్రంలో విసిరేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతా శరీర భాగాల కోసం సముద్రంతో వెతుకుతున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎంను హత్య చేయాలంటూ వీడియో.. వ్యక్తి అరెస్ట్‌!

కరోనా: ప్రముఖ బ్యాట్స్‌మన్‌ టీషర్ట్‌ వేలం!

విద్యార్థినిని ప్రేమ పేరుతో..

కరోనా: హిట్‌ మ్యాన్‌ భారీ విరాళం!

పోలీసులు విచారణకు వెళ్తే..

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా