శంకరయ్య బాగోతాలు బట్టబయలు

11 Jul, 2020 12:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: షాబాద్‌ సీఐ శంకరయ్య ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో కీలక సమాచారం వెల్లడవుతోంది. ఇప్పటికే సోదాల్లో భారీ స్థాయిలో కూడబెట్టిన ఆస్తులను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం‌ హత్యకేసులో నిందితుడు రాకేష్‌రెడ్డితోనూ శంకరయ్యకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో దుండిగల్‌ సీఐగా పనిచేస్తున్న సమయంలో శంకరయ్యకు రాకేశ్‌రెడ్డితో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి వారి మధ్య లావాదేవీలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఇక జయరాం, శిఖ చౌదరీల కాల్‌ డేటాను సీఐ శంకరయ్య ద్వారా రాకేష్‌రెడ్డి రాబట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

శంకరయ్య ఇలా దొరికిపోయారు
షాబాద్‌ సీఐగా పని చేస్టున్న శంకరయ్య జయరాంరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారులు అతని నివాసాల్లో సోదాలు చేపట్టడంతో విస్మయకర విషయాలు తెలుస్తున్నాయి. ఇక శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

శంకరయ్య అత‌ని బందువుల ఇళ్లలో కొన‌సాగిన ఏసీబీ సోదాల్లో ఈ ఆస్తులను గుర్తించారు.

  • ఒక కోటి 5 లక్షల  విలువ చేసే రెండు ఇళ్లు
  • రెండు కోట్ల 28 ల‌క్షల విలువ‌చేసే 11 ఇంటి ప్లాట్స్.
  • 77 ల‌క్షల విలువ‌చేసే 41 ఎక‌రాల 3 గుంట‌ల వ్య‌వ‌సాయ భూమి నిజామాద్, చేవెళ్ల‌, మిర్యాల గూడ‌లో ఉన్న‌ట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
  • 7 ల‌క్ష‌ల విలువ చేసే మారుతి స్విప్ట్ కారు.
  • 21 లక్ష‌ల విలువ చేసే బంగారు ఆభ‌ర‌ణాలు
  • 17 ల‌క్ష‌ల 88 వేల‌ న‌గ‌దు 
  •  6 ల‌క్షల విలువ చేసే ఇత‌ర వ‌స్తువులు 
  • 81 వేల వెండి వ‌స్తువుల‌ను ఏసీబీ అధికారులు గుర్తించారు.

మరిన్ని వార్తలు