పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

17 Jul, 2019 09:29 IST|Sakshi
నిందితుడు మురళి

బంజారాహిల్స్‌: పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన సినీ నటుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన అక్కెనపల్లి మురళీకృష్ణ  అలియాస్‌ సమీర్‌  శ్రీకృష్ణానగర్‌లో ఉంటూ సినిమాల్లో నటిస్తున్నాడు. అతను తన చిన్ననాటి స్నేహితురాలు (24)తో కొంత కాలంగా సన్నిహితంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేశాడు. గత నెల రోజులుగా తప్పించుకు తిరుగుతుండటంతో ఆమె  పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు