స్కూల్‌లో బాలిక ఆత్మ'హత్య'?

22 Jun, 2019 11:06 IST|Sakshi

కోల్‌కతా రాణికుతి ప్రాంతంలోని ఓ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక శుక్రవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. స్కూల్‌ వాష్‌రూమ్‌లో పడి ఉన్న ఆ బాలిక  మొహం చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి ఉంది.  

ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాలిక ఎడమ మణికట్టు దగ్గర చిన్న గాయాలు ఉన్నాయని, అయితే ఆ గాయాల కారణంగా బాలిక మృతి చెందలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో  స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాష్‌రూమ్‌లో బాలిక మృతదేహానికి దగ్గరలో కొన్ని పేజీల నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 నోట్‌లో ‘మూడు నెలల నుంచి సదరు బాలిక నిద్రపోలేనంత ఒత్తిడికి గురైందని’ ఉంది. అయితే బాలిక తన క్లాస్‌లో టాపర్‌ అని, చదువులో ముందుండేదని, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లడానికి ఆసక్తి కనబర్చేదని తెలిసింది. 

మృతిచెందిన బాలికది ఆత్మహత్యానా? లేక హత్యనా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకొన్ప ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. స్కూల్‌ సీసీటీవి ఫుటేజిని చెక్‌ చేస్తున్నామని  పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

మరిన్ని వార్తలు