21 ఏళ్ల యువతికి ఆరో తరగతి బాలుడి వేధింపులు

22 May, 2020 13:46 IST|Sakshi

లక్నో‌: పిదప కాలం.. పిదప బుద్ధులు అంటే ఇవే. ఆరో తరగతి చదివే పిల్లాడు.. 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడంటే.. ఏమనుకోవాలి. యువతి మార్ఫ్‌డ్‌ చిత్రాలను ఉపయోగించి డబ్బులు ఇవ్వు.. లేదంటే సెక్స్‌ చాట్‌ చేయాలంటూ వేధింపులుకు గురి చేస్తున్నాడో పిల్లాడు. ఆ వివరాలు..  ఘజియాబాధ్‌కు చెందిన బాధిత యువతి, సదరు పిల్లాడు విద్యార్థులు క్రియేట్‌ చేసిన ఓ టెలిగ్రామ్‌ గ్రూప్‌లో మెంబర్లు. ఈ గ్రూప్‌లో అన్ని వయసులు విద్యార్థులు ఉంటారు. జూనియర్లకు, సీనియర్‌ విద్యార్థులు అనుమానాలు నివృత్తి చేస్తూ.. బాగా చదువుకునేందుకు సాయం చేస్తూంటారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ పూర్తి చేసి.. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న యువతి ఈ గ్రూప్‌లో జాయిన్‌ అయ్యింది. 6వ తరగతి చదువుతున్న పిల్లాడు కూడా ఈ గ్రూప్‌లో మెంబర్‌.(ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం)

అలా ఇద్దరికి పరిచయం. తొలుత పిల్లాడు, బాధిత యువతితో చదువుకు సంబంధించిన విషయాలు చర్చించేవాడు.  అలా కొద్ది రోజుల పాటు చదువు గురించి మాట్లాడి మంచి వాడిగా నమ్మకం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17న ఉదయం 3.30గంటలకు సదరు పిల్లాడు, యువతి మొబైల్‌కు ఆమె మార్ఫ్‌డ్‌ చిత్రాలు పంపించాడు. ఇవి చూసి సదరు యువతి ఒక్కసారిగా బిక్క చచ్చిపోయింది. అంత చిన్న పిల్లాడు ఇలాంటి పాడు పనులు చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు.

ఈ మెసేజ్‌ గురించి ఆలోచిస్తుండగానే ఆ పిల్లాడు ఫోన్‌ చేసి.. ఆమె సోషల్‌ మీడియా అకౌంట్‌నుంచి ఫోటోలను తీసుకున్నాని.. తాను అడిగినంత డబ్బైనా ఇవ్వాలి.. లేదా తనతో సెక్స్‌ చాట్‌ చేయాలన్నాడు. లేదంటే యువతి మార్ఫ్‌డ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. అంతేకాక ఆమె ఫోన్‌ను హ్యా​క్‌ చేశానని చెప్పాడు. దాంతో భయపడిన యువతి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకుంది. అనంతరం ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు సదరు పిల్లాడిని పిలిపించి మాట్లాడారు. కానీ వాడిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.(ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌)

పిల్లాడిని, అతడి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించగా.. మెసేజ్‌ల గురించి తనకు ఏం తెలియదని.. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు సదరు సోషల్‌ మీడియా కంపెనీతో మాట్లాడి యువతి, పిల్లాడి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని పంపాల్సిందిగా కోరారు. సైబర్‌ టీం ఐపీ అడ్రెస్‌ను ట్రేస్‌ చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో పోలీసులు చిన్న పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌లు ఇవ్వవద్దని.. ఇచ్చినా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు