కోడ్‌ ఉల్లంఘించిన నటుడిపై కేసులు

30 Mar, 2019 12:41 IST|Sakshi

కోడ్‌ ఉల్లంఘించిన కనిమొళి, ఉదయనిధి స్టాలిన్‌

టీ.నగర్‌: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలతో డీఎంకే నేతలపై శుక్రవారం కేసులు నమోదయ్యాయి.

కనిమొళిపై కేసు: హారతి పట్టిన వారికి నగదు అందజేయడంతో కనిమొళిపై శుక్రవారం కేసు నమోదైంది. తూత్తుకుడి నియోజకవర్గంలో డీఎం కే అభ్యర్థి కనిమొళి ప్రచారం చేపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం తిరుచెందూర్‌ అసెంబ్లీ పరిధి ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్‌తో కని మొళి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హారతి పడుతూ కనిమొళికి స్వాగతం పలికిన మహిళలకు అనితా రాధాకృష్ణన్‌ నగదు అందజేసి న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి నట్లు ఏరల్‌ తహసీల్దార్‌ ముత్తురామలింగంకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కనిమొళి, అనితా రాధాకృష్ణన్‌ సహా ఏడుగురిపై తిరుచెందూర్‌ తాలూకా పోలీసు స్టేషన్‌లో మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఉదయనిధి స్టాలిన్‌పై కేసు: కల్లకురిచ్చిలో ఉదయనిధి స్టాలిన్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. పార్లమెంటు ఎన్నికల్లో కల్లకురిచ్చి నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి పొన్‌ గౌతమ్‌ సిఖామణి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ గత 23వ తేది కల్లకురిచ్చి కూడలిలో ఓపెన్‌టాప్‌ వ్యాన్‌లో ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ సమయంలో ఉదయసూర్యుడి చిహ్నా నికి ఓట్లను అభ్యర్థించారు. ఆయన వెంట శంకరాపురం అసెంబ్లీ సభ్యుడు ఉదయసూర్యన్, ఇతరులు ఉన్నారు. ఇదిలాఉండగా ఎన్నికల స్క్వాడ్‌ అధికారి ముఖిలన్‌ కల్లకురిచ్చి పోలీసు స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశాడు.అందులో ఉదయనిధి స్టాలిన్, ఉదయసూర్యన్‌ ఇతర నిర్వాహకులు ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను మీరి ఒకే చోట గుంపుగా ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఉదయనిధి స్టాలిన్, ఎమ్మెల్యే ఉదయసూర్యన్‌లపై పోలీసులు మూడు సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు