నరరూప రాక్షసుడ్ని.. కండోమ్‌ పట్టించింది

17 Jul, 2018 13:28 IST|Sakshi

ఎనిమిదేళ్ల చిన్నారిని ఒళ్లు గగుర్బొడిచే రీతిలో హత్యాచారం చేసి.. ఆపై పోలీసులకు చిక్కకుండా సైకోయిజం ప్రదర్శించిందో మృగం. అయితే ముప్పై ఏళ్ల తర్వాత నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఈ కేసును ఓ కండోమ్‌ సాయంతో పోలీసులు చేధించటం విశేషం. ఇండియానా రాష్ట్రం, ఫోర్ట్‌ వైనే నగరంలో 1988, ఏప్రిల్‌1న 8 ఏళ్ల చిన్నారి ‘ఏప్రిల్‌ టిన్‌స్లే’ అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

మూడు రోజుల తర్వాత అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో బాలిక మృతదేహం ముక్కలై పడి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో చిన్నారిని లైంగికదాడి చేసి, ఆపై చిత్రవధ చేసి చంపినట్లు తేలింది. దీంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు మాత్రం పోలీసులకు సవాల్‌ విసురుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో 1990లో నగరంలోని ఓ గోడ మీద..‘ఆ ఎనిమిదేళ్ల చిన్నారిని చంపింది నేనే. ఆ పాపా ఇంకో షూ మీకు దొరికిందా?.. హహ.. మళ్లీ చంపేస్తా’ అంటూ రాతలు కనిపించాయి. దీంతో పోలీసులు దర్యాప్తును మరింత ఉధృతం చేశారు. సుమారు 30 ఏళ్లుగా దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. చివరికి జన్యుశాస్త్రవేత్త సాయంతో  దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జెనాలజీని ఆశ్రయించారు. (జెనాలజీ అంటే వంశవృక్షాన్ని తయారుచేసేందుకు ఉపయోస్తారు. ఆ డేటా ఇంటర్నెట్‌లో దొరుకుతుంది కూడా).       

కండోమ్‌ ద్వారానే... జెనాలజీ ఆధారంగా గ్రాబిల్‌కు చెందిన జాన్‌ మిల్లర్‌(59), అతని సోదరుడిపై పోలీసులకు అనుమానాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ నెల మొదట్లో జాన్‌ మిల్లర్‌ ఇంటి డస్ట్‌ బిన్‌ నుంచి విచారణ అధికారులు కండోమ్‌లను సేకరించారు. వాటి పరీక్షల అనంతరం నిందితుడు మిల్లరే అని నిర్ధారించిన పోలీసులు.. చివరకు అతన్ని అరెస్ట్‌ చేశారు. తాము ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలోనే మిల్లర్‌ నేరం ఒప్పేసుకున్నాడని అలెన్‌ కౌంటీ పోలీసులు తెలిపారు.  ప్రస్తుతం అతను అలెన్‌ కౌంటీ జైలుల్లో ఉండగా, వచ్చే వారం కేసు కోర్టులో విచారణకు రానుంది. గోల్డెన్‌ స్టేట్‌ కిల్లర్‌, టకోమా చిన్నారి మిచెల్లా వెల్చ్‌ హత్యాచారం కేసు కూడా జెనాలజీ ద్వారానే చిక్కుముడి వీడటం తెలిసిందే.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా