పెళ్లి విందులో డీజే.. డిష్యుం డిష్యుం

1 Jun, 2019 07:52 IST|Sakshi
చిందరవందరగా పడిఉన్న వంట సామగ్రి

పెళ్లి విందులో డీజే విషయంలో గొడవ

పరస్పరం కొట్టుకున్న ఇరువర్గాలు.. పలువురికి గాయాలు

దుండిగల్‌ పీఎస్‌లో కేసులు నమోదు

దుండిగల్‌: ఓ వివాహ వేడుకలో డీజే సౌండ్‌ విషయంలో తలెత్తిన గొడవ గురువారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సుమారు ఆరుగురు వ్యక్తులు మరో 20 మందితో కలిసి వివాహ విందులో వీరంగం సృష్టించారు. పెళ్లి కొడుకు అన్నతో సహా బంధువులపై విచక్షణా రహితంగా దాడులు చేసిన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సూరారం న్యూశివాలయ నగర్‌కు చెందిన సాయిశంతిన్‌కుమార్‌ వివాహ విందు గురువారం రాత్రి ఏర్పాటు చేశారు. రాత్రి 11.30 సమయంలో ఒక్కసారిగా డీజే సౌండ్‌ విషయంలో అంతకు ముందు జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని అదే ప్రాంతానికి చెందిన మన్నె రాజు, మరో 20 మంది కలిసి ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. గతంలో మన్నెరాజుపై దుండిగల్‌ పీఎస్‌ పరిధిలో కేసులు నమోదై ఉండగా తాజాగా ఈ కేసుతో మరో వివాదంలో చిక్కుకున్నాడు. 2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ నుంచి సూరారం డివిజన్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఇతను ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగుతున్నాడు.

గొడవలో డెకరేషన్‌ సెట్, విందు సామగ్రి ధ్వంసమయ్యాయి. ఈ మేరకు సంతోష్, కాశీ, శ్రీకాంత్, వెంకటేశ్, ఉమామహేశ్, నర్సింగ్‌లతో పాటు ఇరవై మంది కుటుంబ సభ్యులపై అకారణంగా దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరంతా షాపూర్‌నగర్‌ రామ్‌ ఆస్పత్రి, సూరారం మల్లారెడ్డి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహిళల మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, అరతులం ఉంగరం, ఐదు తులాల బంగారు చైన్, రెండున్నర తులాల నెక్లెస్, మూడు తులాల నల్లపూసల గొలుసు ఎత్తుకెళ్లిన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దుండిగల్‌ పోలీసు లు 324, 384, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై, తన తమ్ముడు కాశీని చంపేందుకు కుట్ర పన్నాడని బాధితుడు సంతోష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా గొడవ జరుగుతున్న విషయంపై గాయపడిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చిన పెట్రోలింగ్‌ సిబ్బందిపై సైతం దాడికి దిగారు. డీజేను నిలిపి వేయడంతో తిరిగి పెట్టమని ఒత్తిడి చేసి తనపై దాడికి పాల్పడ్డారని మరో వర్గం వారు ఫిర్యాదు చేశారు. తమపై దాడి జరిగిందంటూ ఇరు వర్గాల వారుపోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుమార్తె వద్దకు వెళ్లి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను