కాంగ్రెస్‌ యువ నాయకుడి హత్య

25 Sep, 2018 10:42 IST|Sakshi

అర్ధరాత్రి సినిమా చూసి  వస్తుండగా దారుణం

బెంగళూరు అల్లాలసంద్రలో ఘటన

రాజకీయ విభేదాలతోనే ?

యలహంక : కాంగ్రెస్‌ యువ నాయకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన యలహంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు...అల్లాలసంద్రలో నివాసం ఉంటున్న అరుణ్‌ (26) బ్లాక్‌ యువ కాంగ్రెస్‌ అధ్యక్షుడి వ్యవహరిస్తున్నాడు. ఆదివారం సెకెండ్‌షో సినిమా చూడటానికి అరుణ్‌ స్నేహితులతో కలిసి యశ్వంతపురలోని ఓ మాల్‌కు వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తరువాత కారులో స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరారు.

ఇంటి సమీపంలోని అల్లాసంద్ర గేట్‌ వద్ద కారు దిగుతుండగా అక్కడే కాపుగాచిన దుండగులు మారణాయుధాలతో అరుణ్‌ను విచక్షణారహితంగా హతమార్చి పరారయ్యారు. ఈ దాడిలో అరుణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులు ఈ దారుణాన్ని చూసి పారిపోయారు. కొద్దిసేపు అనంతరం అక్కడికి చేరుని రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అరుణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీసీపీ కళా కృష్ణమూర్తి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ విభేదాలతోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు