కేసు ముగించే కుట్ర 

19 Feb, 2019 03:25 IST|Sakshi
జ్యోతి (ఫైల్‌)

జ్యోతి హత్య కేసులో వెలుగుచూస్తున్న చీకటి కోణాలు 

పోస్టుమార్టం నిర్వహించకనే చేసినట్లు చెప్పిన మంగళగిరి ప్రభుత్వ వైద్యురాలు 

తలపై చిన్న గాటు కూడా పెట్టకుండానే నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందించిన వైనం 

రీపోస్టుమార్టంతో బట్టబయలైన డాక్టర్‌ భారతి వ్యవహారం

ఆమెను సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసు నమోదు చేసే అవకాశం 

స్నేహితుల సాయంతో శ్రీనివాసరావే జ్యోతిని హతమార్చినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు 

నేడో, రేపో శ్రీనివాసరావును అరెస్టు చేసే అవకాశం

అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే కేసును తప్పుదారి పట్టించే కుట్ర పన్నారనే ఆరోపణలు  

సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో సంచలనం కలిగించిన జ్యోతి హత్యకేసులో అటు పోలీసులు.. ఇటు ప్రభుత్వ వైద్యులు అనుసరించిన తీరు, కేసును నీరుగార్చే కుట్రలు బట్టబయలయ్యాయి. ఈ కేసులో పోలీసులు జ్యోతి మృతదేహంపై దుస్తులు, వేలిముద్రలను సేకరించకుండా ఖననం చేయడం.. ఆ తరువాత దొంగచాటుగా మృతదేహాన్ని వెలికితీసి దుస్తులు సేకరించడంతో అనుమానాలు వెల్లువెత్తగా రీపోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో చీకటి కోణం వెలుగు చూసింది. సంచలనాత్మకమైన కేసులో పకడ్బందీగా పోస్టుమార్టం నిర్వహించాల్సిన ప్రభుత్వ వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వహించిన తీరు బయటపడింది. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ జి.విజయభారతి జ్యోతి మృతదేహానికి అసలు పోస్టుమార్టమే నిర్వహించకుండా పొట్టపై చిన్న గాటు పెట్టి కుట్లు వేసి పంపించిన వైనం బయటపడడంతో అటు జిల్లా ఉన్నతాధికారులు, ఇటు పోలీసు అధికారులు ఉలిక్కి పడ్డారు. జ్యోతి తలపై రాడ్డు లాంటి ఆయుధంతో బలంగా కొట్టడం వల్లే ఆమె మృతిచెందిందనేది  అందరికీ తెలిసిన విషయమే. అయితే పోస్టుమార్టం సమయంలో మృతదేహం తలపై చిన్న గాటు కూడా పెట్టిన దాఖలాలు లేవంటే పోస్టుమార్టం ఏవిధంగా నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. జ్యోతి హత్య కేసులో ప్రభుత్వ వైద్యురాలు ఈ విధంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇవి నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్పులు కావని, కుట్రపూరితంగా కేసును పక్కదారి పట్టించేందుకే పథకం ప్రకారం చేసినవనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

డాక్టర్‌ విజయభారతిపై చర్యలు షురూ.. 
జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ విజయభారతిని రెండు రోజుల క్రితం పిలిపించిన జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆమె ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను పరిశీలించి రీపోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వేటు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆమెను సస్పెండ్‌ చేసి వదిలేస్తారా.. లేక క్రిమినల్‌ కేసు సైతం నమోదు చేస్తారా? అనే విషయంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే జ్యోతిని రాడ్డు లాంటి బలమైన ఆయుధంతో తలపై బలంగా కొట్టడం వల్ల తల లోపల పుర్రె ముక్కలు ముక్కలైనట్లు రీపోస్టుమార్టంలో తేలినట్లు తెలుస్తోంది. జ్యోతిది కేవలం హత్య మాత్రమేనని, ఆమెపై ఎటువంటి లైంగిక దాడులు జరగలేదని కూడా తేలినట్లు సమాచారం. 

స్నేహితులతో కలిసి జ్యోతిని హతమార్చిన శ్రీనివాసరావు
జ్యోతిని హతమార్చేందుకు శ్రీనివాసరావు ఏవిధంగా కుట్ర చేశాడనే వైనాన్ని పోలీసులు పూర్తిగా ఆధారాలతో సేకరించినట్లు తెలిసింది. అతని వద్ద పనిచేసే పవన్‌ పోలీసుల అదుపులో అసలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అయితే జ్యోతిని హతమార్చేందుకు శ్రీనివాసరావు తన వద్ద పనిచేసే పవన్‌ సహాయం తీసుకున్నాడా.. అసలు జ్యోతిని ఎలా హతమార్చారు.. శ్రీనివాసరావుకు తగిలిన గాయం ఎవరు చేశారు.. అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే శ్రీనివాసరావు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించకపోవడంతో ఆసుపత్రి నుంచి నేడో, రేపో డిశ్చార్జి చేసి అరెస్టు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. అయితే రాజధాని ప్రాంతంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందనే ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే అధికార పార్టీ నేతలు కేసును పక్కదారి పట్టించేందుకు అటు పోలీసులు, ఇటు ప్రభుత్వ వైద్యులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో పాటు భారీ మొత్తంలో డబ్బులు కూడా చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎవరెవరిపై వేటు పడుతుందో వేచి చూడాలి.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!