మైన‌ర్‌ను వేధించిన కానిస్టేబుల్ తొలగింపు

13 Apr, 2020 13:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ధ‌ర్మ‌పురి: ఓ మైన‌ర్‌తో ప‌లుసార్లు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి వేధించిన కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేయ‌గా.. ఆల‌స్యంగా వెలుగు చూసింది. ధ‌ర్మ‌పురికి చెందిన ఓ బాలిక‌(14) తెలంగాణ రాష్ట్ర అండ‌ర్‌-14 విభాగంలో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించి ఇటీవ‌ల కబ‌డ్డీ పోటీల్లో జాతీయ‌స్థాయికి ఎంపికైంది. క‌బ‌డ్డీలో మ‌రింత ప‌ట్టు సాధించేందుకు జ‌గిత్యాల జిల్లా మ‌ల్యాల మండ‌లానికి పీఈటీ ఆదేశాల మేర‌కు రెండు, మూడు సార్లు ప్ర‌త్యేక కోచింగ్‌కు వెళ్లింది. ధ‌ర్మ‌పురి ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తున్న సురేంద‌ర్ అనే యువ‌కుడు కోచింగ్ ఇచ్చాడు. ఈ స‌మ‌యంలో బాలిక‌ను మాయ‌మాట‌ల‌తో లోబ‌రుచుకునేందుకు అనేక‌సార్లు ప్ర‌య‌త్నించాడు.

ధ‌ర్మ‌పురిలో ఇటీవ‌ల జ‌రిగిన ల‌క్ష్మీన‌ర‌సింహుని బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య ఘ‌ట్ట‌మైన ర‌థోత్స‌వం రోజున వేడుక‌లను తిల‌కించ‌డానికి వ‌స్తున్న బాన‌లిక‌పై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో బాలిక రోదిస్తూ ఇంటికెళ్లింది. త‌ల్లిదండ్రులు, పోలీసులకు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేర‌కు కానిస్టేబుల్ సురేంద‌ర్‌పై పోక్సోయాక్టు కింద వేధింపుల కేసు న‌మోదు చేసి ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా జైలుకు పంపించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేర‌కు కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేశారు. కానిస్టేబుల్‌కు భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలున్నారు. (లే నాన్నా.. లే..)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా