రేప్‌ చేయలేదు కదా? చేశాక చూద్దాం : పోలీసులు

8 Dec, 2019 09:27 IST|Sakshi

లక్నో : ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిపై దాడి ఘటనపై దేశం అట్టుడికిపోతుండగా, అదే జిల్లాలో మరో విస్మయకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నావ్‌ జిల్లాలోని సిందుపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువతి తనపై ఐదుగురు యువకులు అత్యాచారయత్నం చేశారంటూ శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే అత్యాచారం ఇంకా జరగలేదు కదా! జరిగాక వచ్చి ఫిర్యాదు చేయు. అప్పుడు చూద్దామని బదులిచ్చారు.

బాధితురాలి కథనం ప్రకారం.. ‘స్వగ్రామంలో మందులు తీసుకురావడానికి వెళ్తున్న తనను ఐదుగురు యువకులు అడ్డగించి బలాత్కారం చేయబోయారు. వారిలో ముగ్గురిని గుర్తుపట్టగలను. వారి పేర్లు కూడా నాకు తెలుసు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి మొదట నేను 1090 కి కాల్‌ చేశాను. వాళ్లు 100కు ఫోన్‌ చేయమన్నారు. 100కు ఫోన్‌ చేస్తే ఉన్నావ్‌ స్టేషన్‌కి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్తే సంఘటన జరిగిన ప్రదేశం స్థానిక బిహార్‌ పోలీస్‌ స్టేషన్‌ పిరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్లమన్నారు. మూడు నెలల నుంచి నన్ను ఇలాగే తిప్పించుకుంటున్నారు. నేను ఫిర్యాదు చేస్తున్నానని తెలిసి ఆ యువకులు రోజూ మా ఇంటికి వచ్చి కేసు ఫైల్‌ అయితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అయినా ఏదైనా ఘోరం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలి గానీ, జరిగాక హడావిడి చేస్తే న్యాయం ఎలా జరుగుతుంద’ని ఆమె ఓ జాతీయ మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ఈ విషయంపై అక్కడి ఐజీని మీడియా వివరణ కోరగా ఆయన అలాంటిదేమీ లేదని పేర్కొనడం గమనార్హం.  (చదవండి) ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు మృతి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఢిల్లీలో విషాదం, 35మంది మృతి!

మూగజీవి అని కూడా చూడకుండా..

ఉపాధ్యాయురాలిపై మృగాడి వికృత చేష్టలు

టీచర్‌పై సామూహిక అత్యాచారం

ఆ రేప్‌ కేసులో తండ్రీకొడుకులు నిర్దోషులు

అపరకాళిగా మారి హతమార్చింది

‘నువ్వు పిసినారివి రా’..

ఉన్నావ్‌: రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

దారుణం: రెండు సార్లు గ్యాంగ్‌రేప్‌

పాడేరు– కామెరూన్‌ వయా బెంగళూరు

క్షమాభిక్ష అడగలేదు: నిర్భయ కేసు దోషి

ఉన్నావ్‌: వారిని కాల్చి చంపడమే సరైన శిక్ష

ఆగని అఘాయిత్యాలు, మహిళపై కెమికల్‌ దాడి

ఉన్నావ్ ఎఫెక్ట్‌: సొంత కుమార్తెపై పెట్రోల్‌ పోసి..

చీటీవ్యాపారి కుచ్చుటోపీ

ఏసీబీ వలలో జాడుపల్లి వీఆర్వో

ఏనుగులు విడిపోవడంవల్లే...

భార్యను చంపిన భర్తపై లుకౌట్‌ నోటీసులు జారీ

పాఠశాలలో హెచ్‌ఎం భర్త దాష్టీకం

నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్యాయత్నం

గొర్రెల దొంగతనానికి వచ్చి.. గ్రామస్తులకు చిక్కి

చిన్నారిపై అత్యాచారం..ఆపై బాత్రూమ్‌లో..

పద్మారావు నివాసంలో చోరీ యత్నం

గూగుల్‌ పేతో డబ్బులు కాజేశాడు..

ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు

నువ్‌.. మగాడివైతే అర్ధరాత్రి హాస్టల్‌కి రా

మహిళ దారుణ హత్య మిస్టరీనే!?

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు మృతి

నృత్యం ఆపిందని ముఖంపై కాల్చాడు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దుమ్ములేపిన బాలయ్య.. రూలర్‌ ట్రైలర్‌ రిలీజ్‌

ఖమ్మంలో ‘వెంకీ మామ’

ఖుషీ ఖుషీ స్టెప్స్‌

డేట్‌ ఫిక్స్‌

అపజయం మంచికే!

శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి