కరోనా రోగిపై లైంగిక వేధింపులు

7 May, 2020 19:13 IST|Sakshi

గ్రేటర్‌ నోయిడాలో దారుణం

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌తో గ్రేటర్‌ నోయిడాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రోగిని లైంగికంగా వేధించిన ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన 20 ఏళ్ల మహిళ కోవిడ్‌-19తో బాధపడుతూ శ్రద్ధ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు. ఆ మహిళను ఆస్పత్రికి చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు, స్టోర్‌ ఉద్యోగి లైంగికంగా వేధింపులకు గురిచేశారని ఆస్పత్రి నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్‌ చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితులు లవ్‌కుశ్‌, ప్రవీణ్‌లపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఏజెన్సీ ద్వారా రిక్రూట్‌ చేసుకున్న వీరిని విధుల నుంచి తొలగించామని కోవిడ్‌-19 సేవలు అందిస్తున్న ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది.

చదవండి : రెండు నెలల్లో మహమ్మారి విజృంభణ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు