దంపతుల ఆత్మహత్యాయత్నం..భార్య మృతి

13 Dec, 2018 11:59 IST|Sakshi

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి కర్మాన్‌ఘాట్‌లోని సాయినగర్‌లో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా..భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.  ఆయనను ఎల్బీనగర్‌లోని అవేర్‌ గ్లోబల్‌ హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించారు. కుటుంబసభ్యుల తెలిపిన వివరాలు.. ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన రజిత, సంతోష్‌లు భార్యాభర్తలు. కర్మాన్‌ ఘాటలోని సాయినగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

సంతోష్‌ ఉప్పల్‌ ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. గురువారం తెల్లవారుజామున భార్యాభర్తలు తమ గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటం కుటుంబసభ్యులు గమనించారు. వెంటనే అప్రమత్తమై సంతోష్‌ను ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.  ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు