పూజారి వికృత చేష్టలకు దంపతులు ఆత్మహత్య

14 Jun, 2019 07:15 IST|Sakshi

వికృత చేష్టలకుదంపతులు ఆత్మహత్య  

చెన్నపట్టణ తాలూకాలో విషాదం  

పూజారి ఇంటికి నిప్పుపెట్టిన ప్రజలు  

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పక్కింట్లో నివసిస్తున్న పూజారి కామ దాహానికి నిండు నూరేళ్లు జంటగా బతకాల్సిన దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకాలో చోటుచేసుకుంది. తాలూకా సాదరహళ్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ దారుణ ఉదంతం జరిగింది. లోకేశ్‌ (30), కౌసల్య (22) ఆత్మహత్య చేసుకున్న దంపతులు. వీరింటి పక్కనే నివసిస్తున్న మారమ్మ దేవాలయం పూజారి త్యాగరాజ్‌... కౌసల్యను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులపాటు బెంగళూరు తీసికెళ్లి సహజీవనం చేశాడు. తరువాత కౌసల్య పశ్చాత్తాపం చెంది భర్త ఇంటికి తిరిగి వచ్చేసింది.

భారీగా మోహరించిన పోలీసులు, ప్రజలు , కాలిపోతున్న పూజారి ఇల్లు
ఫేస్‌బుక్‌లో అసభ్య చిత్రాలు 
కౌసల్య దూరమవడంతో ఆగ్రహించిన పూజారి త్యాగరాజ్‌ ఆమెతో గతంలో తీసుకున్న అభ్యంతరకర ఫోటోలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో అసలే గుసగుసలాడుకుంటున్న గ్రామస్తులు ఈ సంఘటనతో మరింతగా చిన్నచూపు చూడసాగారు.  ఈ అవమానం భరించలేని లోకేశ్, కౌసల్య ఇక చావే శరణ్యమనుకున్నారు. ఇద్దరూ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  

ఇంటికి, వాహనాలకు నిప్పు  
విషయం తెలుసుకున్న పూజారి తనకు బడితపూజ తప్పదని గ్రామం నుంచి పరారయ్యాడు. దంపతుల మృతితో అగ్రహోదగ్రులైన గ్రామస్తులు పూజారి ఇంటికి నిప్పంటించారు. అతడి కారుని కూడా కాల్చేశారు. ఈ మంటలకు దేవాలయం వద్ద నిలిపి ఉన్న ఒక భక్తునికి చెందిన స్విఫ్ట్‌కారు, నాలుగు బైక్‌లు, ఒక ఆటో, నాలుగు సైకిళ్లు కాలిపోయాయి. గ్రామంలో ఉద్విగ్న పరిస్థితి నెలకొనడంతో పోలీసు బలగాలను మోహరించారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య దంపతుల మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!