కృష్ణా జిల్లాలో కొత్త రకం పైశాచికత్వం

3 Aug, 2018 18:30 IST|Sakshi
వేధింపులకు గురైన భార్యాభర్తలు

సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలో కొత్తరకం పైశాచికత్వం వెలుగుచూసింది. ఆర్థిక లావాదేవీల కారణంగా దంపతులను కిడ్నాప్‌ చేసి రాత్రంతా కారులోనే తిప్పుడూ దాడి చేయడం  స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక సత్యనారాయణపురానికి చెందిన చంద్రశేఖర్‌, రమాదేవిలు దంపతులు. అయితే కొందరు గుర్తుతెలియని దుండగులు వీరిని గురువారం రాత్రి ఇంటి నుంచి కారులో తీసుకెళ్లారు. రాత్రంతా కారులోనూ తిప్పుడు వేధింపులకు గురిచేస్తూ దాడులకు పాల్పడ్డారు. 5 లక్షల రూపాయలు తీసుకున్న అనంతరం శుక్రవారం ఉదయం తిరిగి వారి ఇంటి వద్దే వదిలివెళ్లారు. తమపై కక్షగట్టి ఇలా దాడులకు పాల్పడుతున్నారని బాధిత భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతు వేధింపుల గురించి తమ ఫిర్యాదు చేశారు. రమాదేవికి, చంద్రశేఖర్‌ స్పల్పగాయాలయ్యాయి. 

డబ్బులు తీసుకుని వదిలేశారు
రాత్రి తొమ్మిదన్నర గంటల సమయంలో 8 మంది ఇంటికి వచ్చి దాడి చేశారని, ఆపై అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 3 గంటల ప్రాంతంలో కారులో ఎక్కించుకుని వెళ్లారు. మైలవరం తీసుకెళ్లి తమపై దాడిచేసి అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లల్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు రమాదేవి తెలిపారు. చివరికి 5 లక్షల నగదు ఇస్తే తమను వదిలిపెట్టారని, తమ పిల్లలను చంపేస్తామని బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నోటికి ప్లాస్టర్లు వేసి.. దుప్పట్లలో చుట్టి..
నాలుగున్నరేళ్లుగా ఇక్కడ ఉంటున్నాం. కొందరు వ్యక్తులు మా ఇంటికి వచ్చి దాడి చేసి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. నోటికి ప్లాస్టర్లు వేసి దుప్పట్లలో చుట్టి కారులో మైలవరం తీసుకెళ్లారు. రత్నకుమారి అనే మహిళ ఇంట్లో బంధించి వేధింపులకు గురిచేశారని, పిల్లల్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.  రత్నకుమారికి, నా భార్యకు ఆర్థిక లావాదేవిల్లో కొన్ని విభేదాలున్నాయి. దీంతో మా కుటుంబాన్ని కొంతకాలం నుంచి వేధిస్తున్నారు. ఈ వేధింపుల విషయమై ఇదివరకే  రెండు పర్యాయాలు రత్నకుమారిపై ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందంటూ బాధితుడు చంద్రశేఖర్‌ వివరించాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా