32 రోజుల్లోనే ‘మరణ శిక్ష’ తీర్పు

12 Jul, 2019 03:11 IST|Sakshi

భోపాల్‌: మైనర్‌ బాలికను రేప్‌ చేసి చంపిన కేసుతో పాటు మరో లైంగిక దాడికి పాల్పడిన కేసుల్లో దోషికి మధ్యప్రదేశ్‌ కోర్టు మరణ శిక్ష విధించింది. గత నెల 8న విష్ణు బమోరా(32), ఓ బాలికను (12) రేప్‌ చేసి చంపేశాడు. ఈ బాలికతో పాటు మరో ఎనిమిదేళ్ల బాలికపై అసహజ లైంగిక దాడి చేసినందుకు పోలీసులు పోక్సో, ఐపీసీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద భోపాల్‌లో ప్రత్యేక జడ్జి కుముదిని పటేల్‌ ఈ కేసును విచారించారు.

30 మంది చెప్పిన సాక్ష్యాలను, ఫోరెన్సిక్‌ నిపుణులు ఇచ్చిన డీఎన్‌ఏ రిపోర్టులను పరిశీలించారు. వీటితో పాటు పోలీసులు గత నెల 12న 108 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. వీటన్నింటినీ పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేలుస్తూ మూడు, ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు మరణ శిక్షను విధించారని రాష్ట్ర న్యాయ శాఖ అధికార ప్రతినిధి సుధా విజయ్‌ సింగ్‌ భదోరియా తెలిపారు. ఈ శిక్షలన్నీ ఒకేసారి అమలవుతాయని తెలిపారు.

మరిన్ని వార్తలు