లుంబీనీ పేలుళ్ల కేసు.. అనూహ్య తీర్పు

4 Sep, 2018 11:24 IST|Sakshi

ఇద్దరు దోషులు.. మరో ఇద్దరు నిర్దోషులుగా తేల్చిన కోర్టు

సోమవారం వెలవడనున్న తుది తీర్పు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.  ఇద్దరు దోషులుగా తేల్చిన న్యాయస్థానం మరో ఇద్దరని నిర్దోషులుగా ప్రకటించింది. దోషుల్లో అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి‌, అనీఖ్‌ షఫిక్‌ సయ్యద్‌లకు శిక్ష ఖరారైంది. దోషులపై సెక్షన్‌ 302 కింద అభియోగాలు నమోదయ్యాయి. సాదిక్‌ ఇష్రార్‌ షేక్, ఫారూఖ్‌ సర్ఫుద్దీన్‌ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 

 రెండో కేసులో తుది తీర్పును సోమవారం వెలువరించనుంది. ఇక దోషులకు విధించే శిక్ష ఆ రోజే తెలియనుంది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్‌ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్‌ రజాఖాన్, రియాజ్‌ భత్కల్, ఇక్బాల్‌ భత్కల్‌ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్‌ షఫీఖ్‌ సయీద్, సాదిక్‌ ఇష్రార్‌ షేక్, ఫారూఖ్‌ సర్ఫుద్దీన్‌ తర్ఖా ష్, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి, మహ్మద్‌ తారీఖ్‌ అంజుమ్‌ ఎహసాన్‌)పై విచారణ జరిగింది.

మరిన్ని వార్తలు