మరోసారి భారీ ఎత్తున మాస్క్‌ల పట్టివేత

25 Mar, 2020 16:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో  పెద్ద ఎత్తున మాస్క్లు పట్టుబడ్డాయి. అక్రమంగా  దాచి వుంచిన కోటి రూపాయల విలువైన మాస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల నిల్వలను అరికట్టడానికి జరిపిన దాడుల సందర్భంగా  అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి అందిన పక్కా సమాచారంతో ముంబై సబర్బన్ షా వేర్‌హౌసింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ గోడౌన్ పై దాడి చేసిన  పోలీసులు సంఘటన స్థలంలో 200  బాక్సుల  ఫేస్ మాస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ యజమాని, ఏజెంట్, సరఫరాదారుతో సహా ఐదుగురిపై కేసు నమోదుచేశారు. ( మహమ్మారి వెంటాడినా.. )

ఈ ఐదుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ మంజునాథ్ సింఘే తెలిపారు. ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్‌లు వంటి ముఖ్యమైన వస్తువులను నిల్వ చేయడం నేరమని ఆయన అన్నారు. కాగా  సోమవారం సాయంత్రం, ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్  రూ. 15 కోట్ల విలువైన 25 లక్షల అధిక-నాణ్యత గల ఫేస్ మాస్క్లను పోలీసుల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ( జర్నలిస్టుకు కరోనా పాజిటివ్‌ )

మరిన్ని వార్తలు