ముగ్గురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్‌

17 Aug, 2019 16:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత నెల 26న తార్నాకలో నివాసం ఉండే సతీష్‌ రెడ్డి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పార్థి గ్యాంగ్‌ ఈ నేరానికి పాల్పడినట్లు సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడగా వారిలో మనీషా డిస్కో, అలీ రాజా ఖాన్, రూపా బాయ్‌లను అరెస్ట్‌​చేశామన్నారు. అంతేకాక వారి వద్ద నుంచి 22 లక్షల రూపాయల విలువ చేసే 60 తులాల బంగారం, 2 కిలోగ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నమన్నారు. ఈ గ్యాంగ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2004 నుంచి దొంగతనాలకు పాల్పడుతుందని తెలిపారు.

ఈ గ్యాంగ్‌ మధ్యప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంజనీ కుమార్‌ పేర్కొన్నారు. మొదటిసారి మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు MP09CK2347 కార్లో వచ్చి దొంగతనం చేసి పారిపోయారన్నారు. ఆ తరువాత వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని.. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, రేణిగుంట పోలీస్ స్టేషన్లలో ఈ గ్యాంగ్‌పై దాదాపు 12 కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ ఈ గ్యాంగ్‌లో 99శాతం మందికి ఉద్యోగం, ఉపాధి లాంటివి కల్పించామని.. మిగిలిన కొద్ది మంది ఇంకా ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారని అంజనీ కుమార్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య చేతిలో

వాట్సాప్‌లో సర్పంచ్‌ పేరు పెట్టలేదని..

దారుణం: 8 ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం

ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్‌' వివాదం

హత్య వెనుక ప్రేమ వ్యవహారం

సినిమా

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు

నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

ఒక్కరికైనా సాయపడండి