శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి

14 Apr, 2018 13:26 IST|Sakshi
వ్యక్తి వివరాలు పరిశీలిస్తున్న సీపీ కార్తికేయ

నిజామాబాద్‌ సీపీ కార్తికేయ

పట్టణంలో కార్డన్‌ సెర్చ్‌

ఆర్మూర్‌: ప్రతి పౌరుడు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖతో సహకరించాలని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ అన్నారు. పట్టణంలోని 2వ వార్డు పరిధిలో గల రంగాచారి నగర్, సంతోష్‌నగర్, జిరాయత్‌ నగర్‌ కాలనీల్లో శుక్రవారం వేకువజామున సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అడిషనల్‌ డీసీపీ శ్రీధర్‌రెడ్డి, ఆర్మూర్, బోధన్‌ ఏసీపీలు శివకుమార్, రఘు, సీఐలు సీతారాం, రమణారెడ్డితో పాటు 14 మంది సీఐలు, 23 మంది ఎస్‌ఐలు, 10 మంది ఏఎస్‌ఐలు, 25 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, వంద మంది కానిస్టేబుళ్లతో పాటు మహిళా కానిస్టేబుళ్లు సైతం ఈ సెర్చ్‌ పాల్గొన్నారు. పోలీసు బలగాలు ఇంటింటికీ సోదాలు చేశారు.

అనుమానంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్‌ చేసారు. సుమారు వంద బైకులు, రెండు ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు సరైన పత్రాలు లేక సీజ్‌ చేసారు. కాలనీలోని ఇళ్లలో నివసిస్తున్న వారి ఆధార్‌ కార్డులను సై తం పరిశీలించారు. సీపీ కార్తికేయ స్థానికులతో మాట్లాడారు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇ వ్వాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లితే పోలీసులకు తెలిపితే పెట్రోలింగ్‌ నిర్వహించే కా నిస్టేబుళ్ల ఆ ఇళ్లను గమనిస్తారన్నారు. దీంతో చో రీలు తగ్గిపోతాయన్నారు. పట్టణంతో పాటు అ న్ని గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసామన్నారు. ఒకవేళ ఎవరైనా నేరానికి పాల్పడితే సీసీ కెమెరాల ద్వారా దొరికి పోతున్నారన్నారు. ఇలాంటి వారికి జరిమానాలతోపాటు జైలు శిక్ష సైతం విధిస్తారన్నారు.  

మరిన్ని వార్తలు