అమ్మ.. దొంగా..!

1 May, 2018 12:10 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

పోలీసులనే బురిడీ కొట్టించిన ఘనాపాటీలు

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వైనం

రాయచోటిటౌన్‌ : వారిద్దరు క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడి బుకీకి డబ్బులు బాకీ పడ్డారు. బాకీలోకి చెల్లేసుకోమంటూ తమ బైకును ఇచ్చేశారు. ఆ తర్వాత తమ బైకు చోరీకి గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనాల తనిఖీలో పోలీసులు అసలు విషయాన్ని కనిపెట్టి నిందితులను అరెస్టు చేశారు.

అర్బన్‌ సీఐ మహేశ్వరరెడ్డి  కథనం మేరకు వివరాలు ఇలా ఉ న్నాయి.  రాయచోటి పట్టణ శివార్లలో మంగళవారం వాహనాల రికా ర్డులు తనిఖీ చేస్తున్న సమయంలో ప్రొద్దుటూరుకు చెందిన రాజశేఖ ర్‌ అనే వ్యక్తి వచ్చి ఆయన వద్ద ఉన్న రికార్డులు పోలీసులకు చూపిం చాడు. రికార్డులను ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలించిన పోలీసులు ఈ వాహనం గతంలో చోరీకి గురైనట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ వాహనం ఎక్కడిది.. నీకు ఎవరిచ్చారు.. అని పోలీసులు ప్రశ్నించారు. రామాపురం మండలానికి చెందిన నవకాంత్‌ రెడ్డి, సోమిరెడ్డిలు తన వద్ద క్రికెట్‌ బెట్టింగ్‌లో ఓడిపోయి రూ.30వేలు బాకీ పడ్డారని, దీనికి సంబంధించి రూ.24 వేలకు సోమురెడ్డి వాహనాన్ని నవకాంత్‌ రెడ్డి తనకు అమ్మాడని చెప్పారు.

మిగిలిన మొత్తం రూ.6,000 నగదు చెల్లించారని చెప్పాడు. ఆ తరువాత సోమురెడ్డి, నవకాంత్‌ రెడ్డిలు ఇద్దరు కలసి తమ వాహనం రాయచోటి పట్టణంలో తమ బంధువుల ఇళ్ల వద్ద పెట్టి ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు బైకు ఆచూకీ తెలియకపోవడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వారికి ఇవ్వడంతో వీరు ఇ న్సూరెన్స్‌ కంపెనీ వారికి అందించి కంతులు కట్టకుండా తప్పించుకున్నారు. ఇలా వ్యవహారం నడిపిన ఇద్దరు చివరికి ఇలా పోలీసులకు చిక్కారు. దీంతో పో లీసులు వీరిపై కేసు నమోదు చేసి కోర్టు కు హాజరుపెట్టారు. అర్బన్‌ ఎస్‌ఐ రమేష్‌బాబు ఉన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా