ప్రజల సహకారంతోనే నేరాలు అదుపు

7 Jun, 2018 12:17 IST|Sakshi
మాట్లాడుతున్న ఏసీపీ రక్షిత కె.మూర్తి , వేదికపై మహిళలు  

కోల్‌సిటీ(రామగుండం) : ప్రజల సహకారంతోనే నేరాలను అదుపు చేయవచ్చని గోదావరిఖని ఏసీపీ రక్షిత కె.మూర్తి అన్నారు. గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక అడ్డగుంటపల్లిలోని సిరిఫంగ్షన్‌హాల్‌లో ‘షీటీం’పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... బాల్యవివాహాలను ప్రోత్సహించవద్దని సూచించారు. పిల్లలు చదువుపై శ్రద్ధ వహించేలా తల్లిదండ్రులు దృష్టిసారించాలని కోరారు.

పిల్లల నడవడికపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. మహిళలు, యువతులను ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్తీల్లో ఎవరైనా అనుమానితులు కలిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, షీటీం వాట్సాప్‌తోపాటు 100 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

మఫ్టీలో పోలీసులు నగరంలో రోజూ తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. షీటీం, గ్రామ రక్షణ దళాలు, పరివర్తన్, హాక్‌ ఐ తదతర వాటిపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ మహేందర్, ఎస్సై తోపాటు పోలీసు సిబ్బంది, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా