సైబర్‌ వల

10 Oct, 2017 13:31 IST|Sakshi

అమాయకులు, సామాన్యులే లక్ష్యం

ఫోన్‌ ఎత్తితే చాలు.. క్షణాల్లో నగదు మాయం

హడలెత్తుతున్న బ్యాంకు ఖాతాదారులు

పొద్దస్తమానం చెమటోడ్చి నాలుగు డబ్బులు సంపాదించి తమ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి.. ఎంతో కొంత భవిష్యత్‌ అవసరాల కోసం బ్యాంకుల్లో దాచుకుంటారు. ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో ఎక్కడో ఉన్న సైబర్‌ నేరగాళ్లు ఖాతాలో క్షణాల్లో ఉన్న నగదు నిల్వలను లాగేసుకుంటున్నారు. డెబిట్, క్రెడిట్‌ కార్డుల డేటా హ్యాకింగ్‌కు పాల్పడుతూ ఖాతాదారుల్లో కలవరం పుట్టిస్తున్నారు.

గద్వాల క్రైం: బ్యాంకింగ్‌ సేవలు సరళతరమైన నేపథ్యంలో ఖాతాదారులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు కంటిమీద కునుకు లేకుండా సైబర్‌ మాయగాళ్లు తలనొప్పులు సృష్టిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల, ఇటిక్యాల, అలంపూర్‌ తదితర మండలాల్లో ఖాతాదారుల డబ్బులను సైబర్‌ నేరగాళ్లు సునా యాసంగా తస్కరిస్తున్నారు. జిల్లాలో ఈ ఘటనలపై జిల్లా పోలీసులు బ్యాంక్‌ ఖాతాదారులకు ముం దుస్తు భద్రతగా పలు సూచనలు చేస్తూ.. హైఅలర్ట్‌ ప్రకటించారు. దీంతో వివిధ బ్యాంకుల ఖాతాదారులు హడలిపోతున్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వ చేసేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.

సులభతరమే.. భయంకరం
ఖాతాదారుల సేవలను సులభతరం చే యడానికి ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆన్‌లైన్, ఆటోమేటిక్‌ టెల్లర్‌ మెషీన్‌ (ఏటీఎం), డెబిట్, క్రెడిట్‌ కార్డులు, వివిధ యా ప్స్‌ ద్వారా ఖాతాదారులు ఇప్పుడు చెల్లింపులు చేస్తున్నారు. ఆయా సేవలు సులభతరమే అయినా ఖాతాదారులకు భ యంకరంగా మారాయి. సులభంగా మోసాలు, చోరీలు చేయడానికి ఓ వేదికగా మారుతున్నాయి. ఇక వివిధ స్థాయి బ్యాం క్‌ ఖాతాదారులకు నేరుగా వారి సమాచా రం సేకరించి హిందీ, ఇంగ్లిష్, మరాఠీ భా షల్లో బ్యాంక్‌ అధికారులుగా మాట్లాడు తూ మీ యెక్క ఖాతా నంబర్‌కు అదనపు సమాచారం పొందుపర్చడానికి, ఆధార్, ఏటీఎం పిన్, ఫోన్‌ నంబర్‌ వంటి వివరాలతో కొంతమంది సైబర్‌ నేరగాళ్లు ఖాతా లను హ్యాక్‌ చేస్తున్నారు. మీ ఖాతాలను అప్‌డేట్‌ చేస్తున్నామని నమ్మకంగా వివరించి ఖాతాకు సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టి క్షణాల్లో వ్యక్తిగత ఖాతాల నుంచి డబ్బులను మాయం చేస్తారు.  

నంబర్‌ అప్‌డేట్‌ చేయాలి..
కొత్త మొబైల్‌ నంబర్‌ను ఖాతా ఉన్న అన్ని బ్యాంకుల శాఖలకు అప్‌డేట్‌ చేయడం మం చిది. వ్యక్తిగత ఖాతా నుంచి నగదు బ దిలీ జరిగిన ప్రతిసారి మొబైల్‌కు సమాచా రం వస్తుంది. అయితే బ్యాంకుల్లో మీ యె క్క ఫోన్‌ నంబర్‌ రిజిస్టర్‌ లేకుంటే వెంటనే అధికారులకు తెలియజేసి ఖాతాకు ఫోన్‌ నంబ ర్‌ జతపరిచే విధంగా చర్యలు చేపట్టాలి.

ఇక్కడి నుంచే మోసాలు
సైబర్‌ నేరాలు ఎక్కువగా ఢిల్లీ, బీహార్, ముంబయి, ఉత్తరప్రదేశ్, నైజీరియన్, ఇతర దేశాల కేటుగాళ్లు ఇలాంటి మోసాలు ఎక్కువగా చేస్తుంటారు. నూతన టెక్నాలజీ ఆధారంగా కొత్త ఐడీలను ఏర్పాటు చేసి ప్రజల ఖాతాల నుంచి క్షణాల్లో డబ్బులను మాయం చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి మోసాలపై నిఘా పోలీసులకు సమాచారం అందించి ఆకతాయిల ఆగడాలకు చెక్‌ పెట్టవచ్చు.

నమోదైన కేసులు
డిసెంబర్‌ 8, 2016న గద్వాల పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్‌ ప్రభాకర్‌ ఖాతా నుంచి రూ.90 వేలు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు మాయం చేశారు.
సెప్టెంబర్‌ 1వ తేదీ 2017లో గద్వాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి దౌలు వ్యక్తిగత ఖాతాలో రూ.36 వేలు డ్రాచేశారు.
సెప్టెంబర్‌ 18వ తేదీ 2017లో గద్వాలకు చెందిన సోమిరెడ్డి అనే వ్యక్తి ఖాతాలో రూ.60 వేలు మాయమయ్యాయి.
ఏకంగా జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైని తల్లిదండ్రుల ఇరువురి ఖాతాల నుంచి రూ.20 వేలు ఆన్‌లైన్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు గత నెలలో మాయం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు గద్వాల, అలంపూర్, ఇటిక్యాల పోలీసు స్టేషన్‌లలో 13 కేసులు నమోదు కాగా సుమారు రూ.3 లక్షలకుపైగా ఆన్‌లైన్‌లో ఖాతాదారుల సొమ్మును కొల్లగొట్టారు.

నిఘా ఏర్పాటు చేశాం..
జిల్లాలోని వివిధ బ్యాంక్‌ ఖాతాదారులు అపరిచిత ఫోన్‌ కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్‌ అధికారులు వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితిలో అడగరు. ఒకవేళ ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ వస్తే నేరుగా బ్యాంక్‌కు వస్తామని చెప్పాలి. వారి నంబర్లను పోలీసులకు తెలియజేయాలి. ఇలాంటి సైబర్‌ నేరాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఎవరూ కూడా మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.– బాలకోటి, డీఎస్పీ, గద్వాల

మరిన్ని వార్తలు