బెజవాడలో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

15 Dec, 2019 12:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు విజయవాడ పోలీసులకు సవాల్‌గా మారాయి. బెజవాడలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. అమాయక ప్రజలే టార్గెట్‌గా మోసాలకు తెగబడుతున్నారు. బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత సమాచారాన్ని చోరీలు చేస్తున్నారు. తాజాగా విజయవాడలో మరో సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది. ఎల్‌ఐసి ప్రీమియం జమ కాలేదంటూ చిట్టి నగర్‌కు చెందిన షేక్‌ నజీర్‌కు అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ప్రీమియం చెల్లించినా జమ కాకపోవడంతో ఆ ఆగంతకులకు ఆయన వివరాలు తెలపగా, బ్యాంకు ఖాతాలోని 18వేలను సైబర్‌ నేరగాళ్లు డ్రా చేశారు. సైబర్‌ క్రైం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. అపరిచిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ,ఓటీపీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు