పెద్ద మనుషులుగా చలామణి అవుతూ..!

11 Oct, 2019 16:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద మనుషులుగా చలామణి అవుతూ..గత ఐదేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర్ర దొంగల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు చెందిన నలుగురు దొంగలు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని సీపీ పేర్కొన్నారు.

ఇప్పటి వరకూ ఈ ముఠా 10 చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని పేర్కొన్నారు. వారివద్ద నుంచి 60 తులాల బంగారం, 2 కిలోల వెండి, ఇన్నోవా  వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు. నిందితులు వారి గ్రామాల్లో వ్యాపారం నిర్వహిస్తూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారని తెలిపారు. ఏడాదిలో ఒకసారి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల వైపు వచ్చి చోరీలకు తెగబడుతున్నారని చెప్పారు. చోరీల కోసం వచ్చినప్పుడు ఖరీదైన హోటళ్లలో బస చేసి..తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా