అమానుషం: దళితుడి ముఖంపై ఉమ్మి, రాడ్లతో కొట్టి

10 Jun, 2020 11:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ఉన్నత వర్గానికి చెందిన యువతిని ప్రేమించినందుకు ముఖంపై ఉమ్మి, రాడ్లతో కొట్టి ఓ దళిత వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు.. పుణెకు చెందిన విరాజ్‌ విలాస్‌ జాగ్తాప్‌(20) ఉన్నత కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ విషయం కాస్తా యువతి కుటుంబానికి తెలియడంతో యువకుడితో పలుమార్లు గొవడకు దిగారు. ఈ వాగ్వాదం పెరిగి పెద్దదవడంతో అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు యువకుడికి ఫోన్‌ చేసి మాట్లాడాలని పిలిపించారు. ఈ క్రమంలో అమ్మాయి ఇంటికి వెళ్లిన యువకుడిని కులం పేరుతో దూషించి, అసభ్యకరమైన పదజాలంతో యువతి తల్లిదండ్రులు అతన్ని అవమానించారు. (బురుండీ అధ్యక్షుడి హఠాన్మరణం )

అనంతరం అక్కడ నుంచి బయటకు వచ్చి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విరాజ్‌ను యువతి బంధువులు ఆరుగురు యువకుడిని అడ్డుకొని టెంపోతో దాడి చేశారు. దీంతో విరాజ్‌ బైక్‌పై నుంచి కింద పడగా కనీస కనికరం లేకుండా నిందితులు అతనిపై రాళ్లు, రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. యువతి తండ్రి విరాజ్‌ ముఖంపై ఉమ్మి వేశాడు. అనంతరం అక్కడి నుంచి వారు పరారయ్యారు. రక్తపు మడుగుల మధ్య ఉన్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు యువకుడు మరణించాడు. (భార్య మాట వినటం లేదని భర్త హల్‌చల్‌)

ఈ ఘటనపై విరాజన్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండగా వారిని రిమాండ్‌ హోమ్‌కు తరలించారు. కాగా తన కొడుకును చంపిన వారిని ఉరి తీయాలని, అప్పుడే మరోసారి ఇలాంటి దారుణ సంఘటనలు జరగకుండా ఉంటాయని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు