కాళ్లు మొక్కేదాకా వదల్లేదు

14 Jun, 2018 20:52 IST|Sakshi

అహ్మదాబాద్‌: మరో హేయనీయమైన ఘటన వెలుగు చూసింది. గుజరాత్‌లో దళిత యువకుడిపై దాడి చేసిన కొందరు వ్యక్తులు.. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి వైరల్‌ చేశారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల ఫిర్యాదుతో వ్యవహారం మీడియాకు చేరింది.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం... వీడియోలో ఉన్న యువకుడు తాను అగ్ర కులానికి చెందిన వాడిగా ప్రచారం చేసుకున్నాడు. అయితే అది అబద్ధం అని తేలటంతో కొందరు అతన్ని అడ్డగించి చితకబాదారు. కనికరించి వదిలేయాలని విజ్ఞప్తి చేసినా విడిచిపెట్టలేదు. ‘చంపుతాం’ అంటూ అతన్ని కిందపడేసి ఇష్టమొచ్చినట్లు తొక్కుతూ పిడిగుద్దులు గుప్పించారు. ‘బాపు.. క్షమించండి’ అంటూ వేడుకున్నా వారు వదల్లేదు. చివరాఖరికి కాళ్లు మొక్కి, క్షమాపణలు కోరటంతో  వాళ్లు అతన్ని వదిలేశారు.

మరో కథనం ప్రకారం... బాధితుడ్ని విఠలాపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడా? పోలీసులు కేసు నమోదు చేశారా? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం గుజరాత్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని వార్తలు