లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీడీ

14 Feb, 2018 20:05 IST|Sakshi
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్‌ యాదయ్య, విచారణ చేస్తోన్న ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ గౌడ్‌

కరీంనగర్‌ : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ  ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్‌(డీడీ) పెరిక యాదయ్య ఏసీబీకి చిక్కారు. కూరగాయల కాంట్రాక్టర్‌ కనకయ్యకు ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు వంట వండే క్యాటరింగ్‌ పర్మిషన్‌ ఇచ్చేందుకు డీడీ యాదయ్య రూ.1.30 లక్షలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కనకయ్య ఏసీబీ అధికారులకు తెలియజేశాడు.

దీంతో పధకం ప్రకారం యాదయ్యను అరెస్ట్‌ చేసేందుకు వ్యూహం పన్నారు. అనుకున్న విధంగా రాంనగర్‌లో కనకయ్య రూ.లక్ష ఇస్తుండగా యాదయ్యను పట్టుకున్నారు. మధ్యవర్తిగా వెళ్లిన లక్ష తీసుకున్న అటెండర్‌ శ్యామ్ సుందర్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు