ఇద్దరు చిన్నారుల దుర్మరణం

4 Feb, 2018 03:19 IST|Sakshi

పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి

కుక్కకాటుతో ఆరేళ్ల బాలుడు మృతి

హుజూరాబాద్‌ రూరల్‌ / జమ్మికుంట: కరీంనగర్‌ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని జమ్మికుంట మండలం మోత్కులగూడెంలో పక్షం రోజుల క్రితం కుక్కకాటుకు గురైన ఆరేళ్ల బాలు డు శుక్రవారం రాత్రి చనిపోగా, హుజురాబాద్‌ మండలం చెల్పూర్‌ పరిధి రాజాపల్లిలో నాలుగేళ్ల చిన్నారిని పాము కాటు వేయడంతో చనిపోయింది. రాజపల్లెకు చెందిన పత్తి కోమల్‌రెడ్డి, అర్చనల కుమార్తె కీర్తన(4) ఎల్‌కేజీ చదువుతోంది. సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటివద్దే ఉంది.

సాయంత్రం ఇంటి సమీపంలోని చెట్ల పొదల వద్ద ఆడుకుంటుం డగా పాము కాటేసింది. ఈ విషయం చిన్నారికి తెలియకపోవడంతో ఏడుస్తూనే ఉండిపోయిం ది. రాత్రి 9 గంటల ప్రాంతంలో అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన హుజూరాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. అలాగే, మోత్కులగూడెం గ్రామానికి చెందిన రమేశ్, లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. రమేశ్‌ ‘108’ పైలట్‌గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సాయిరాం (6) యూకేజీ చదువుతున్నాడు.

గతనెల 19న మధ్యాహ్నం ఇంటి కొస్తుండగా.. కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. లలిత ఇంట్లో నుంచి పరుగెత్తుకుం టూ వచ్చేలోపే మెడభాగంలో కాట్లుపడ్డాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సాయిరాం శుక్రవారం అకస్మాత్తుగా పడిపోయాడు. దీంతో తల్లి 108లో జమ్మికుంట ఆస్ప త్రికి తీసుకెళ్లింది. ఏ ఆస్పత్రిలోనూ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో హుజూరా బాద్‌కు తీసుకెళ్లింది. వారి సూచన మేరకు హైదరాబాద్‌ తీసుకెళ్లగా చనిపోయాడు.

మరిన్ని వార్తలు