విద్యార్థి దారుణ హత్య

6 Aug, 2019 10:05 IST|Sakshi
ద్వారకానాథ్‌  

అలిపిరి పోలీసుల విచారణ

సాక్షి, తిరుపతి : నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థిని దారుణంగా హత్యచేసిన ఘటన సోమవారం తిరుపతిలో చోటుచేసుకుంది. అలిపిరి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ షేక్షావలి తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా కోడూరుకు చెందిన  ద్వారకానాథ్‌(20) తిరుపతి–రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో బీబీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. స్థానిక శెట్టిపల్లెలో స్నేహితుడు సాయితో కలిసి అద్దెకు గదిలో ఉంటున్నాడు. విద్యార్థి తలిదండ్రులు కువైట్‌æలో ఉంటున్నారు. ఇలా ఉండగా కొంతకాలంగా బయట విద్యార్థులతో గొడవలు పడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఎంఆర్‌. పల్లిలోని కొందరు వ్యక్తులతో ద్వారకానాథ్‌ గొడవ పడినట్లు సమాచారం. అనంతరం ఆ యువకులు విద్యార్థిన్ని శెట్టిపల్లి గేటు సమీపంలోకి పిలిపించారు. అక్కడికి వచ్చిన ద్వారకనాథ్‌పై బీరుబాటిళ్లతో దాడి చేసి కత్తులతో మెడపై పొడిచారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని గుర్తించిన కొందరు రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు ఆస్పత్రికి  చేరుకుని విచారిస్తున్నారు. హత్యకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేనసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ కళాశాలకు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు