సినిమా ప్రేరణతో.. భారీ చోరి

15 Apr, 2019 08:35 IST|Sakshi

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ సినిమా ‘స్పెషల్‌ చబ్బీస్‌’ ప్రేరణతో ఐటీ అధికారులుగా నమ్మబలికి. దాదాపు 48 లక్షల రూపాయల డబ్బును దోచుకెళ్లిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. రాజౌరీ గార్డెన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంట్లో లెక్కలో చూపించని సొమ్ము పెద్ద మొత్తంలో ఉందని తెలుసుకున్న నలుగురు వ్యక్తులు దాన్ని కాజేయాలని భావించారు. అందుకోసం ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారులమని చెప్పి.. నకిలీ గుర్తింపు కార్డులు చూపించి.. ఆ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో దాదాపు రూ.48 లక్షల సొమ్మును సీజ్‌ చేస్తున్నట్లు చెప్పి దోచుకెళ్లారు.

డబ్బును సీజ్‌ చేసినట్లు మెమో జారీ చేయడమే కాక.. రెండు రోజుల్లో ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఆఫీస్‌కు వచ్చి సరైన ఆధారాలు చూపించి సొమ్ము తీసుకెళ్లాల్సిందిగా తెలిపారు. దాంతో పాటు ఇంటికి సంబందించిన సీసీటీవీ కెమరా రికార్డింగ్స్‌ను కూడా నిందితులు తమతో పాటు తీసుకెళ్లారు. తదుపరి విచారణలో ఈ రికార్డింగ్స్‌ పనికొస్తాయని తెలిపారు. దాంతో బాధితులు ఇన్‌కమ్‌ట్యాక్స్‌ కార్యాలయానికి వెళ్లి జరిగింది చెప్పగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ కార్యలయానికి చెందిన అధికారులు ఎవరూ సదరు ప్రాంతంలో ఎలాంటి దాడులు చేయలేదని అధికారులు పేర్కొన్నారు.

మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు పోలీస​స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు సదరు ప్రాంతం సీసీటీవీ కెమరా ఫుటేజ్‌ని పరిశీలించగా.. కారులోంచి ఓ నలుగురు వ్యక్తులు దిగడం.. బాధితుల ఇంటికి వెళ్లడం వంటి అంశాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిలో ఇద్దరిని అరెస్ట్‌ చేసి రూ. 22.45లక్షల సొమ్మును రికవరీ చేసుకున్నారు. మిగతా ఇద్దరి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భర్త వ్యాధులు నయం చేస్తానని మహిళపై..

దారుణం: 24 మంది సజీవ దహనం

డ్రైవర్‌ నిద్రమత్తు.. 9 మంది దుర్మరణం..!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

మద్యం మత్తులో తాళం పగులగొట్టి ఆత్మహత్య

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

పని చేస్తున్నసంస్థకే కన్నం

నీళ్లనుకుని లైజాల్‌ తాగి...

సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

అల్లుడిని చంపిన మామ

వజ్రాల వాటాలో గొడవ.. అందుకే చంపేశాం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

డ్రైయినేజీలో ఆలయ హుండీలు!

వైద్యం అందక చిన్నారి మృతి

బాబాయిపై అబ్బాయి బండరాయితో దాడి!

సినీ నటి డాటా చోరీ

ఒకరి వెంట ఒకరు..

ఆ బస్సు ఎక్కితే అంతే సంగతులు..!

అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..

ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి

కిలాడీ ‘యాప్‌’తో జర జాగ్రత్త!

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

చికెన్‌ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య

హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ

టైర్‌ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం