పట్టపగలు.. నడిరోడ్డు మీద

20 May, 2019 08:21 IST|Sakshi

న్యూఢిల్లీ : పట్టపగలు.. జనంతో కిక్కిరిసిన రోడ్డు మీద రెండు గ్యాంగ్‌లు పరస్పరం కాల్పులతో బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాత నేరస్తులు మృతి చేందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ద్వారకా మోర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నవడా ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌ గెహ్లోత్‌, వికాస్‌ దళాల్‌ రెండు వేర్వేరు గ్యాంగ్‌లు నడుపుతూ నేరాలకు పాల్పడుతుంటారు. వీరి మీద ఢిల్లీ, హరియాణాలో గతంలోనే హత్యా, కిడ్నాప్‌, దొంగతనం వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ప్రవీణ్‌ గెహ్లోత్‌ ప్రయాణిస్తున్న కారును మరో గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు తమ కారుతో అడ్డగించడమే కాక కాల్పులకు తెగబడ్డారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఢిల్లీలో రెండు గ్యాంగ్‌లు పరస్పరం కాల్పులు

దాంతో ప్రవీణ్‌ గెహ్లోత్‌ కూడా కాల్పులు ప్రారంభించాడు. నడి రోడ్డు మీద.. జనం చూస్తుండగానే దాదాపు 15 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగలు. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మెట్రో స్టేషన్‌కు సమీపంలోనే పోలీసులు ఉండటంతో.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావడం గమనించిన నిందుతులు అక్కడి నుంచి పారరయ్యారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేరస్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. రెండు గ్యాంగ్‌ల మీద కేసు నమోదు చేశామని.. త్వరలోనే నిందితులను  అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. దలాల్‌ 2018 హరియాణా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని వచ్చాడని.. అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠా అరెస్టు

దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తాని చెప్పి లాడ్జిలో..

అసెంబ్లీ బాత్రూంలో గొంతు కోసుకుని

స్వామీజీకి వింత అనుభవం!

పురుగుల మందు తాగినీటి గుంటలో పడి..

నా సెల్‌ నంబర్‌ బ్లాక్‌ చేశారు

ప్రేమ జంటలను ఉపేక్షించేది లేదు..

ఆ దంపతులు ప్రభుత్వ ఉద్యోగులైనా..కాసుల కోసం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి 

తెల్లవారితే దుబాయ్‌ ప్రయాణం

యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ వికృత చర్య

సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి

ఉలిక్కిపడిన చిత్తూరు 

ప్రాణాలు తీస్తున్న ఈత సరదా

బెం‘బ్లేడ్‌’ ఎత్తిస్తూ..

ఘరానా మోసగాళ్లు అరెస్టు..

పర్సు కొట్టేసిన ఎయిరిండియా పైలట్‌

పీకలదాకా తాగి నడిరోడ్డుపై న్యూసెన్స్‌

భర్తను గట్టిగా ఓ చెంపదెబ్బ కొట్టిందంతే..

ఆధిపత్య పోరు.. ఆలయం కూల్చివేత

దమ్‌ మారో దమ్‌!

అఖిల్‌ ఎక్కడ?

భార్యను చంపి, ఉప్పు పాతరేసి..

కామాంధుల అరెస్టు 

చిత్తూరులో దారుణం.. నాటుబాంబు తయారు చేస్తుండగా!

అందువల్లే నా తమ్ముడి ఆత్మహత్య

ఒంగోలు ఘటనపై స్పందించిన హోంమంత్రి

బోయిన్‌పల్లిలో దారుణం..

ఘోరం: టెంట్‌కూలి 14 మంది భక్తులు మృతి

రాజధానిలో ట్రిపుల్‌ మర్డర్‌ కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జై సేన సూపర్‌హిట్‌ అవ్వాలి

తలచినదే జరిగినదా...

నా శత్రువు నాతోనే ఉన్నాడు

పండగ ఆరంభం

కంగారేం లేదు

కొత్త డైరెక్టర్లు నన్ను కలవొచ్చు