అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి!

29 Jun, 2020 12:04 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతిచోట థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడం తప్పని సరిగా మారింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిని ఏయిర్‌ పోర్టులోనే స్క్రీనింగ్‌ చేసి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ నుంచి తప్పించుకొని ఓ వృద్ధుడు పరారైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. గార్డెన్‌ ప్రాంతానికి చెందిన హర్జిత్‌ సింగ్‌(72) అనే వ్యక్తి  శనివారం  AI 1916 విమానంలో కజకిస్తాన్‌ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. విమానాశ్రమంలో దిగిన అనంతరం అధికారుల కళ్లు గప్పి టెర్మినల్ -3 వద్ద ఉన్న స్క్రీనింగ్ హాల్‌ నుంచి తప్పించికొని పరారయ్యాడు. (సెల్ఫ్‌ ఐసోలేషన్‌‌లో ఉంటానని చెప్పి..)

ఈ విషయంపై ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసులకు సమాచారమివ్వగా  కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సింగ్ ఉద్దేశపూర్వకంగా స్క్రీనింగ్ విధానాన్ని తప్పించుకొని వెళ్లినట్లు అధికారులు పోలీసులకు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణీకుడు ఎయిర్‌పోర్టు అధికారులు ఇచ్చిన మొబైల్‌ నెంబర్‌, ఇంటి చిరునామా ప్రస్తుతం వాడుకలో లేనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ ఫుటేజీ సహాయంతో సింగ్‌ విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లిన వెహికిల్‌ ఆధారంగా ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి అతడిని 14 రోజులు క్వారంటైన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. (లగ్జరీ బైక్‌పై చీఫ్‌ జస్టిస్‌; ఫోటోలు వైరల్‌)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు