కారు ప్రమాదం: పోలీసు అధికారిపై కేసు

4 Jul, 2020 16:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఓ పోలీసు అధికారి అతివేగంగా కారు నడిపి ఓ మహిళను ఢికోట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడిన ఘటన ఢిల్లీలోని ఘాజిపూర్‌​ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా కారు నడిపిన పోలీసు అధికారి యోగేంద్ర(56)పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. యోగేం‍ద్ర తూర్పు ఢిల్లీలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో యోగేంద్ర ఘాజిపూర్‌ సమీపంలోని చిల్లా గ్రామం​లో మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ రోడ్డుపై వెళుతున్న మహిళను ఢికొట్టాడు. (కరోనా భయం; యువతిపై అమానుషం!)

దీంతో బాధితురాలు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానికులు ఆమెను రక్షించేందుకు ఘటన స్థలానికి వెళ్లడంతో వారిని చూసిన అధికారి తప్పించుకునే క్రమంలో కారుని వేగంగా మహిళపైకి దూసుకేళ్లాడు. ఈ క్రమంలో సదరు మహిళను కారు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థుల కారు వెనకాలే పరుగెత్తి అధికారిని అడ్డుకున్నారు.  అ ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. వాటి ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌ యోగేంద్రపై మద్యం సేవించి కారు నడపడమే కాకుండా, మానవ ప్రాణానికి హాని కలిగించేలా నిర్లక్ష్యంగా వ్యవహరిచిన అతడిని సస్సెండ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు