అమ్మా క్షమించు..

15 Dec, 2017 08:38 IST|Sakshi

ఈ జీవితానికి మనసు అలవాటు పడట్లేదు

ఫ్రెండ్స్‌.. అమ్మను బాగా చూసుకోండి

మిత్రులకు వాయిస్‌ రికార్డ్‌ పంపి

డీఈఓ కార్యాలయ అటెండర్‌ ఆత్మహత్య

బి.కొత్తకోట/చిత్తూరు ఎడ్యుకేషన్‌: ‘అమ్మా నన్ను క్ష మించు.. నేను బతికుండి రోజూ చావలేను.. అందుకే ధైర్యం చాలక మద్యం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని తల్లికి సూసైడ్‌ నోట్‌ రాసి చిత్తూరు డీఈవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న డి.శ్రీకాంత్‌రెడ్డి (27) బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెద్దపసుపుల గ్రామానికి చెందిన డి.వెంకటరెడ్డి ఉపాధ్యాయుడు. ఆయన బి.కొత్తకోట మండలం శీలం వారిపల్లె పంచాయతీ గుంతావారిపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. 2015 వరకు ఇక్కడి పనిచేసిన ఆయన పీటీఎం మండలానికి బదిలీ అయ్యా రు. పల్లె వాతావరణంలోనే నివాసముండాలని గుంతావా రిపల్లె సమీపంలో 25 కుంటల భూమిని కొనుగోలుచేసి ఇంటిని నిర్మించుకున్నారు. ఏడాదిన్నర క్రితం ఆయన ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఇంటర్‌ వరకు చది విన కుమారుడు డి.శ్రీకాంత్‌రెడ్డికి చిత్తూరు డీఈవో కార్యాలయంలో అటెండర్‌ ఉద్యోగం వచ్చింది. అతను 6 నెలలుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మూడు రోజులు సెలవు తీసుకుని సొంతూ రు వచ్చాడు. ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఇతనికి అక్క సంధ్య, తల్లి రమాదేవి ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ కేవీహెచ్‌.నాయుడు, ఏఎస్‌ఐ టీ.ప్రసాద్‌ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. రమాదేవి ఆరోగ్యం బాగలేకపోవడంతో వైద్యం కోసం బెంగళూరు వెళ్లారు. వారికి సమాచారం అందించారు.

అమ్మా నిన్ను బాధపెడుతున్నా..

అత్మహత్యకు ముందు శ్రీకాంత్‌రెడ్డి సూసైడ్‌ నోట్‌ రా శాడు. అందులో ‘సారీ మా.. నా తలలో ఏదో దూరింది.. నేను బతికుండి రోజూ చావలేను.. నా మెంటల్‌ కండీషన్‌ బాగోలేదు.. నన్ను క్షమించు మా నిన్ను బాధపెడుతున్నందుకు. నేను జాబ్‌లో చేరినప్పటి నుంచి హ్యాపీగా లేను. కొద్దిరోజులైతే అలవాటుపడతాననుకొన్నా. కానీ నావల్ల కావడం లేదు. నాన్న ఉన్నప్పుడు నేను ఇలా లేను. నా మనసు ఈ జీవితానికి అలవాటు పడట్లేదు. మా నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు బాధపడకు. నా ఆత్మకు శాంతి ఉండదు. మా నువ్వు, నా ఫ్రెండ్స్‌ బాగుండాలి. డోంట్‌ క్రై మా.. సారీ మా.. మిస్‌ యూ మా. లేఖలో తప్పులున్నా యి ఎందుకంటే తాగి ఉన్నాను క్షమించు మా.. సారీ ఫ్రెండ్స్‌ తాగడానికి కారణం చావడానికి ధైర్యం చాలలా.. సంధ్య అమ్మను బాగా చూసుకో. నా చావుతో ఎవరికి ఎటువంటి సంబంధం లేదు’ అంటూ సంతకం చేసి ముగించాడు శ్రీకాంత్‌రెడ్డి.

స్నేహితులకు వాయిస్‌ రికార్డ్‌

ఆత్మహత్యకు ముందు శ్రీకాంత్‌రెడ్డి స్నేహితులకు వాయిస్‌ రికార్డ్‌ పంపించాడు. అందులో మా సారీ మా.. బాయ్‌ మా.. నేను వెళ్లిపోతున్నా.. అని ఉంది. వాయిస్‌ రికార్డును చూసిన మిత్రులు అనుమానంతో శ్రీకాంత్‌రెడ్డికి ఫోన్‌ చేసినా స్పందించలేదు. మదనపల్లె నుంచి ఇద్దరు మిత్రులు గురువారం ఉదయమే గుంతావారిపల్లెకు చేరుకున్నారు. కిటికీలోంచి చూడగా శ్రీకాంత్‌రెడ్డి ఉరివేసుకొని మృతి చెంది ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాంత్‌రెడ్డి తమతో కలిసి మదనపల్లెలో చదువుకున్నాడని మిత్రులు వినోద్, సుధాకర్, ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు
శ్రీకాంత్‌రెడ్డి మంచివాడు. ఆరు నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా.. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని సోమవారం నుంచి బుధవారం వరకు సెలవు తీసుకున్నాడు. ఇక్కడ అతనికి వేధింపులు, ఇబ్బందులు ఉన్నట్టు నా దృష్టికి రాలేదు. – పాండురంగయ్య, డీఈవో, చిత్తూరు

మరిన్ని వార్తలు