దిశను చంపిన దగ్గరే ఎన్‌కౌంటర్‌..

6 Dec, 2019 08:14 IST|Sakshi

సంఘటనా స్థలానికి సీపీ సజ్జనార్‌

సాక్షి, హైదరాబాద్‌ : దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సంఘటనా స్థలానికి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఎన్‌కౌంటర్‌పై మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా దిశను చంపిన ప్రాంతంలోనే నిందితులు ఎన్‌కౌంటర్‌ అయ్యారు.

దిశ కేసు దర్యాప్తును సైబరాబాద్‌ పోలీసులు సవాల్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను షాద్‌ నగర్‌ పోలీసులు పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. దిశ అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి పెట్రోల్, డీజిల్‌ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతంలో క్రైమ్‌ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌  చేస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ కేసులో ఏ-1 మహ్మద్‌ ఆరిఫ్‌, ఏ-2 శివ, ఏ-3 నవీన్‌, ఏ-4 చెన్నకేశవులను పోలీస్‌ ఎన్‌కౌంటర్‌ చేశారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. 

చదవండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డాక్టర్‌ సుధాకర్‌పై సస్పెన్షన్‌ వేటు

లాక్‌డౌన్‌లో.. లిక్కర్‌ దందా..!

మనస్తాపంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

మహిళపై లైంగికదాడి; పాస్టర్‌పై కేసు

ప్రియుడితో కలసి సోదరి హత్య

సినిమా

డ్రైవర్‌ పుష్పరాజ్‌

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు