పథకం ప్రకారమే దివ్య హత్య!

20 Feb, 2020 02:27 IST|Sakshi
లొంగిపోయిన వెంకటేశ్, గజ్వేల్‌లో ఆందోళన చేస్తున్న దివ్య బంధువులు

మలుపులు తిరుగుతున్న దివ్య హత్య కేసు 

ఘటన సమయంలో గజ్వేల్‌లోనే నిందితుడి ఫోన్‌ సిగ్నల్స్‌ 

ఆ దిశగానే పోలీసుల విచారణ ముమ్మరం 

వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన వెంకటేశ్‌ 

దివ్యకు, వెంకటేశ్‌కు ముందే పెళ్లైందన్న నిందితుడి తండ్రి 

ఆమెను తానే చదివించానని వెల్లడి 

గజ్వేల్‌/వేములవాడ: బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్యోదంతం మలుపులు తిరుగుతోంది. పథకం ప్రకారమే ఆమె హత్య జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచా రం. మంగళవారం రాత్రి గజ్వేల్‌లోని తమ ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యపై దాడి చేసి పదునైన ఆయుధంతో గొంతు కోయడంతో ఆమె మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో గత కొన్నేళ్లుగా వేధిస్తున్న వెంకటేశ్‌ అనే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అయితే, దివ్య, తన కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, హైదరాబాద్‌లో ఇరువురూ కలిసి కొంతకాలం ఉన్నారని వెంకటేశ్‌ తండ్రి చెప్పడం సంచలనంగా మారింది. మరోపక్క వెంకటేశ్‌ బుధవారం వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. 

పదో తరగతి నుంచే... 
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాలపల్లి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. హత్యకు గురైన దివ్య చిన్న కుమార్తె. లక్ష్మీరాజం వేములవాడ ఆలయం వద్ద కిరాణా దుకాణం నిర్వహిస్తూ ప్రైవేటు లాడ్జిని లీజుకు తీసుకొని నడిపేవారు. ఆ సమయంలో దివ్య వేములవాడలోని వెంకటరమణ ప్రైవేటు పాఠశాలలో టెన్త్‌ చదివింది. వేములవాడలోని శాస్త్రినగర్‌కు చెందిన కైరి పరుశురాం, లత దంపతుల కుమారుడు వెంకటేశ్‌ కూడా అదే పాఠశాలలో పదో తరగతి చదివాడు. అప్పటినుంచే దివ్యను ప్రేమ పేరుతో వేధించేవాడని మృతురాలి తల్లిదం డ్రులు ఆరోపిస్తున్నారు.

ఇంటర్‌ సమయంలోనూ వేధింపులు కొనసాగించాడని, దీంతో వెంకటేశ్‌పై వేములవాడ, ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశామని చె బుతున్నారు. ఓసారి దివ్య కోసం ఒంటిపై కిరోసిన్‌ పోసు కుని ఆత్మహత్యకు యత్నించగా.. వెంకటేశ్‌ కుటుంబీకులు తమపై దాడికి ప్రయత్నించారని లక్ష్మీరాజం వెల్లడించారు. దీంతో తాము కొంతకాలం హైదరాబాద్‌ వెళ్లిపోయామని.. అప్పుడే తమ కుమార్తె ఓయూలో డిగ్రీ పూర్తిచేసి, ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో ఉద్యోగం సాధించిందన్నారు.  

కొంతకాలంగా వెంకటేశ్‌ రెక్కీ? 
వరంగల్‌కు చెందిన సందీప్‌తో దివ్యకు పెళ్లి కుదిరింది. ఈ నెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో దివ్యపై కక్ష పెంచుకున్న వెంకటేశ్‌ కొంతకాలంగా గజ్వేల్‌ వచ్చి ఆమె ను దూరం నుంచి గమనించడం.. ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరగడం చేస్తుండేవాడని పోలీసు విచారణలో బ యటపడినట్టు సమాచారం. పథకం ప్రకారం ఆమెను హ త్యచేసే ఉద్దేశంతో గజ్వేల్‌ వచ్చాడని, దివ్య తల్లిదండ్రులు పెళ్లి పనులపై ఎల్లారెడ్డిపేట వెళ్లారని తెలియడంతో అదను చూసి ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడిచేసి చంపేశాడని అ నుమానిస్తున్నారు.

దివ్య కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకటేశ్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ట్రేస్‌ చేయగా.. ఆ సమయం లో అతడు గజ్వేల్‌లోనే ఉన్నట్టు వెల్లడైంది. దీంతో వెంకటేశ్‌ను పట్టుకునేందుకు గజ్వేల్, వేములవాడలకు రెండు ప్ర త్యేక బృందాలను పంపించారు. అనంతరం వెంకటేశ్‌ తల్లిదండ్రులను విచారణ నిమిత్తం వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్‌ నేరుగా ఠాణాకు వచ్చి లొంగిపోయాడు. దీంతో అతడిని విచారణ నిమిత్తం సిద్దిపేట పోలీసులకు అప్పగించారు. 

దివ్య కుటుంబీకుల ఆందోళన: దివ్య మృతదేహానికి పోస్టుమార్టం సందర్భంగా గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రివద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. న్యాయం జరిగేంతవరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమంటూ భీష్మించారు. అంతలో మంత్రి కేటీఆర్‌..ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ సభ్యుడు ఆగయ్యకు ఫోన్‌చేసి.. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ విషయాన్ని ఆగయ్య చెప్పడంతో ఆందోళనకు తెరపడింది. దివ్యకు ఎల్లారెడ్డిపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు: పరుశురాం 
వెంకటేశ్, దివ్య ప్రే మించి పెళ్లి చేసుకున్నార ని అతడి తండ్రి పరుశు రాం విలేకరులకు తెలిపారు. ఇద్దరూ టెన్త్‌ సమయంలోనే ప్రేమలో పడ్డార నీ, పెళ్లయిన తర్వాత దివ్య తల్లిదండ్రులు ఆమెను ఇ క్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారన్నారు. దీంతో తానే స్వ యంగా డబ్బులు ఖర్చుచేసి దివ్యను హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంచి చదివించానని చెప్పారు. ఓయూ క్యాంపస్‌లో చదువుతున్న దివ్య.. దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంజనీరింగ్‌ కోచింగ్‌ తీసుకుంటున్న వెంకటేశ్‌తో కలసి ఉన్నట్లు వివరించారు. అయితే.. ఉద్యోగం వచ్చాక దివ్య ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. అప్పట్నుం చి తన కుమారుడు వెంకటేశ్‌ ఇబ్బందులు పడుతున్నా డని చెప్పారు. తిరిగి దివ్యకు తల్లిదండ్రులు దగ్గరై పెళ్లి సంబంధాలు చూడటంతో వెంకటేశ్‌ మానసిక సంఘర్షణ కు గురయ్యాడన్నారు. నిజానికి తన కుమారుడు పిరికివాడని, హత్య చేసేంత ధైర్యం అతడికి లేదని అతని తండ్రి పరశురాం వివరించారు.

మరిన్ని వార్తలు