నాకు న్యాయం చేయండి

9 May, 2018 09:56 IST|Sakshi

ఆడ పిల్లలు పుట్టారని నా భర్త మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడు

ప్రెస్‌క్లబ్‌లో కన్నీటి పర్యంతమైన మహిళా టీచర్‌

సిద్దిపేటకమాన్‌ : రెండో పెళ్లికి సిద్ధమైన తన భర్త నుంచి తనకు న్యాయం చేయాలని సిర్సినగండ్లకు చెందిన సరిత కన్నీటి కన్నీటి పర్యంతమైంది. ఆడపిల్లలు పుట్టారనే నెపంతో విడాకులు తీసుకుంటున్నట్లు లాయర్‌ ద్వారా నోటీస్‌ ఇప్పించి, అనంతరం నా న్యాయవాదితో కుమ్మక్కై థర్డ్‌ పార్టీ డైవోర్స్‌ వచ్చినట్లు పత్రాలు సృష్టించాడని ఆవేద వ్యక్తం చేసింది.  మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ..

ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న తనకు సిర్సినగండ్లకు చెందిన తాటిపాముల శ్రీనివాస్‌తో 2006 లో విహాహం జరగగా, 2008లో మొదటి పాప, 2015లో రెండో పాప పుట్టిందని తెలిపింది. రెండవ పాప పుట్టిన అనంతరం తాను పుట్టింకి వెళ్లగా భర్త రాలేదని, కనీసం ఇంటికి రమ్మని కూడా అనలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత డైవోర్స్‌ కేసు ఫైల్‌ చేసి, నా తరపు లాయర్‌తో కుమ్మక్కై తనకు తెలియకుండానే ఎక్స్‌ పార్టీ డైవోర్స్‌ తీసుకున్నాడని కన్నీటి పర్యంతం అయ్యింది.

ఆ కాపీని అందరికి చూపిస్తూ మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలిపింది. ఈ నెల 6న చేర్యాల మండలం మర్రిముచ్చాలకు చెందిన ఓ అమ్మాయితో కొమురవెల్లి దేవస్థానంలో పెళ్లికి సిద్ధమవ్వగా తాను కేసు పోలీసులకు ఫిర్యాదు చేయగా పెళ్లి ఆపారని తెలిపింది. గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారని చెప్పింది.

గ్రామంలో మంగళవారం పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడడానికి వెళ్లగా భర్త రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద మనుషులు అతనికి ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదని, ఆ తర్వాత స్విచ్ఛాప్‌ చేసుకున్నాడని తెలిపింది. తన లాగే మరో అమ్మాయి మోస పోకుండా ఉండాలనే విలేకరుల సమావేశం నిర్వహించినట్లు చెప్పింది. 

మరిన్ని వార్తలు