న్యాయం జరిగేలా చూడాలి

5 Jun, 2018 09:11 IST|Sakshi
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ చందనాదీప్తి 

అధికారులను ఆదేశించిన ఎస్పీ చందనాదీప్తి

మెదక్‌ మున్సిపాలిటీ : ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ చందనాదీప్తి అధికారులను ఆదేశించారు.సోమవారం మెదక్‌లోని జిల్లా పోలీసుకార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా మనోహరబాద్‌ మండలం కొండాపూర్‌ గ్రామానికిచెందిన జల్లి రామకృష్ణ తాను ప్రేమించుకొని 2018 మే24న  ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నామని, దీంతో మా కుటుంబ పెద్దలు నా భర్తను చంపేస్తామని బెదిరిస్తున్నారని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్‌ గ్రామానికిచెందిన దాసరి హైమావతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అలాగే తన భర్త పరమేష్‌ ప్రతిరోజు మద్యం తాగివచ్చి కొడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మెదక్‌ మండలం అవుసుపల్లి గ్రామం బొల్లారం తండాకు చెందిన బానోత్‌రాణి ఫిర్యాదు చేసింది.

మా సొంత వ్యవసాయ భూమిని గొల్ల కంచన్‌పల్లి నర్సింలు అనే తనకు తెలియకుండా ట్రాక్టర్‌తో దున్నాడని, ఈ విషయంలో అతన్ని ప్రశ్నించగా గ్రామ పెద్ద సమక్షంలో విచారణ చేస్తుండగా నా కొడుకులను నర్సింలు,యాదయ్య, మహేష్‌ అనే వ్యక్తులు దాడిచేసి గాయపర్చారని, న్యాయం చేయాలంటూ శివ్వంపేట మండలం దంతాన్‌పల్లి గ్రామానికి చెందిన గొల్ల పెంటయ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చట్టపరమైన విషయంలో న్యాయం జరగకుంటే ఫిర్యాదుదారులు తిరిగి తనను సంప్రదించవచ్చన్నారు.

మరిన్ని వార్తలు