కుక్క‌ను బైకుకు క‌ట్టి, కి.మీ లాక్కెళ్లి..

7 Jun, 2020 10:26 IST|Sakshi

ముంబై: మూగ జీవాల‌పై మ‌నిషి ఆగ‌డాల‌కు అంతు లేకుండా పోతోంది. కేర‌ళ‌లో గ‌ర్భిణీ ఏనుగు హ‌త్యోదంతం, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఆవు నోట్లో ట‌పాసులు పేల్చి గాయ‌ప‌ర్చిన‌ ఘ‌ట‌న‌లు మ‌రువ‌క‌ముందే మ‌హారాష్ట్ర‌లో మ‌రో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఔరంగాబాద్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు కుక్క మెడ‌కు గొలుసు క‌ట్టి దాన్ని బైకుకు బిగించారు. ఆ త‌ర్వాత కిలోమీట‌ర్ దూరం వ‌ర‌కు దాన్ని బైకుపైనే లాక్కుపోయారు. మెడ‌కు బిగుస్తున్న ఉచ్చుతోపాటు, రోడ్డుపై చ‌ర్మం గీసుకుపోతుండ‌టంతో కుక్క బాధ‌తో విల‌విల్లాడిపోయింది. అయిన‌ప్ప‌టికీ దాన్ని హింసిస్తూ ఆ క్రూర మ‌నుషులు రాక్ష‌సానందం పొందారు. (వారి ఆచూకీ చెబితే రూ.50 వేలు..)

దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. మ‌రోవైపు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ ఇలాంటి అమానుష ఘ‌ట‌నే చోటు చేసుకుంది. కొంద‌రు దుండ‌గులు ఓ శున‌కంపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. దెబ్బ‌లు తాళ‌లేక అది అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు పొక్క‌డంతో స్పందించిన‌ పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. (ఆవుపైనా అమానుషత్వం)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు