మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

16 Jul, 2019 06:39 IST|Sakshi

పైలట్‌పై సస్పెన్షన్‌ వేటు  

సాక్షి బెంగళూరు: విధుల్లో లేకపోయినా మద్యం తాగి వచ్చి కాక్‌పిట్లో ప్రయాణించిన ఓ పైలట్‌ను ఎయిర్‌ ఇండియా సంస్థ మూడు నెలల పాటు విధుల నుంచి తొలగించింది. ఈ నెల 13వ తేదీన ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానంలో జితేంద్రసింగ్‌ అనే పైలట్‌ సాధారణ ప్రయాణికునిలా వచ్చాడు. అయితే ప్రయాణికుల రద్దీ వల్ల సీటు లేకపోవడంతో కో పైలట్‌ స్థానంలో అతడు కూర్చుని బెంగళూరుకు చేరుకున్నాడు. అతడు అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు.

బెంగళూరు చేరుకోగానే విమానాశ్రయ అధికారులు కాక్‌పిట్‌లో పరీక్షలు చేయగా జితేంద్రసింగ్‌ మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. మద్యం సేవించి కోపైలట్‌ సీటులో కూర్చోవడం నిబంధనల ఉల్లంఘనే అని నిర్ధారించి మూడు నెలల పాటు సస్పెండ్‌ చేశారు. మద్యం తాగి ప్రయాణించవచ్చు, కానీ కాక్‌పిట్‌లో కూర్చోకూడదనే నిబంధనలు ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు