మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

7 Nov, 2019 10:08 IST|Sakshi
నిందితులను పట్టుకొస్తున్న ఎస్‌ఐ

బోయకొండ రోడ్డులో బైక్‌ను ఢీకొన్న సుమో

ప్రశ్నించినందుకు మహిళ సహా ఇంకొకరిపై దాడి

పోలీసుల రాకతో పరుగులు తీసిన వైనం

అదుపులో 8మంది నిందితులు

చిత్తూరు,చౌడేపల్లె : మద్యం మత్తులో యువకులు చౌడేపల్లెలో  బుధవారం సాయంత్రం హల్‌చల్‌ చేశారు. చిత్తూరు నగర సమీపంలోని తేనెబండ హరిజనవాడకు చెందిన కొందరు యువకులు వాహనాల్లో  బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వచ్చారు. దర్శనం అనంతరం  బోయకొండ కింద  విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు.  ఫూటుగా మద్యం సేవించారు.  బోయకొండ నుంచి చౌడేపల్లె మీదుగా చిత్తూరుకు బయలుదేరి వెళ్తుండగా చిన్నకొండామర్రి సమీపంలో అదే గ్రామానికి చెందిన సురేంద్ర, మరో మహిళ కలిసి బైక్‌మీద చౌడేపల్లెకు బయలుదేరారు. ఇదే మార్గంలో యువకులు ప్రయాణిస్తున్న టాటా సుమోకు ఎదురుగా మరో వాహనం వచ్చింది. ఈ సందర్భంలో బైక్‌ను సుమో ఢీకొనడంతో అదుపు తప్పి వాహనదారులు కిందపడ్డారు.

సుమో డ్రైవర్‌ను, ద్విచక్రవాహనదారుడు సురేంద్ర ప్రశ్నించగా వెంటనే వాహనంలోని యువకులు అతనితోపాటు మరో మహిళను  దుర్భాషలాడి, దాడిచేసి గాయపరిచి పరారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు పలమనేరు మార్గంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో సుమో వెళ్తుండగా చేజ్‌చేసి పట్టుకున్నారు. జరిగిన సంఘటన పై ప్రశ్నించిన పోలీసులు లోకేష్, మంజునాథ్‌పై వారు దాడికి యత్నించారు. కానిస్టేబుళ్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌కు ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చారు. వెంటనే ఎస్‌ఐ సిబ్బందితో అక్కడికి చేరుకోగా వారు పంట పొలాల వైపు పరుగులు తీశారు. ఎస్‌ఐ, సిబ్బంది వెంటాడి ఎనిమిది మందిని  అదుపులోకి తీసుకొన్నారు. క్షతగాత్రులు ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు. అతిగా మద్యం సేవించి హల్‌చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించి నిందితులను   విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరంగల్‌లో వీసా.. మోసం

కామారెడ్డి ఆర్డీఓకు బెదిరింపు కాల్‌?

హనీప్రీత్‌కు బెయిల్‌

అనుమానాస్పద మృతి: దహన సంస్కారాలను అడ్డుకున్న పోలీసులు

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్‌ మృతి

ఉత్తమ అధికారే... అవినీతి తిమింగలమా ?

ప్రేమ వివాహం: జీవితంపై విరక్తితో ఆత్మహత్య

రూ.50 ఇవ్వలేదని అంతమొందించారు

ట్యూషన్‌ టీచర్ అశ్లీల వీడియోల చిత్రీకరణ

ఉపాధ్యాయుడి వికృత చర్య

స్నేహానికి గుర్తుగా ప్రాణం ఇస్తున్నా!

‘నిన్ను చంపి.. నేనూ చచ్చిపోతా’

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పక్కా ప్లానింగ్‌ ప్రకారమేనా..?

సురేష్‌ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం : డాక్టర్లు

బాగానే వెనకేశారు.. దొరికిపోయారు

30 శాతం రాయితీతో నచ్చిన వాహనం..

వేధింపులు తాళలేక సంధ్య ఆత్మహత్య

మత్తు.. చిత్తు

దేవుడా.. ఎంత పని చేశావయ్యా!

పోలీసుల అదుపులోబంగ్లా దేశీయులు

వలపు వల.. చిక్కితే విలవిల

రైలు ఢీకొని టెక్నీషియన్‌ మృతి

నకిలీ డాక్టర్‌ దంపతుల అరెస్ట్‌

ప్రాణం తీసిన సెల్ఫీ

పిన్ని, బంధువుల ఫోటోలు సైతం అసభ్యంగా ఫేస్‌బుక్‌లో

విమానం టాయ్‌లెట్‌లో కిలోలకొద్ది బంగారం

మనిషి తలతో వచ్చిన రైలు ఇంజిన్‌

విషమంగా సురేశ్‌ ఆరోగ్యం..

కలకలం; 190 చోట్ల సీబీఐ సోదాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య