మాజీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు నమోదు

3 Jan, 2020 09:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిధుల మళ్లింపుపై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసింది. రూ.16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియాకి మళ్లించినట్లు గా ఈడీ గుర్తించింది. ఫెమా చట్టం కింద రాయపాటితో  పాటు ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది. రాయపాటి సాంబశివరావుతో పాటు ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీలపై ఇప్పటికే  సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 15 బ్యాంకుల నుంచి 8,832 కోట్ల రూపాయలు రుణాలను కంపెనీ తీసుకుంది. 3,822 కోట్ల రూపాయల ఫండ్‌ డైవర్ట్‌ అయినట్లుగా సీబీఐ అనుమానిస్తోంది. సింగపూర్‌,మలేషియా,రష్యాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లుగా అభియోగాలు ఉన్నాయి.


(చదవండి:
‘ట్రాన్స్‌ట్రాయ్‌’ కేసులో.. తవ్వుతున్న సీబీఐ
 అక్రమబంధంపై సీబీఐ

>
మరిన్ని వార్తలు