దారుణం : 8ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిపి ఆపై..

9 Jun, 2019 20:46 IST|Sakshi

సాక్షి, భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి మురుగు కాలువలో పడేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని మురికివాడలో నివాసముంటున్న బాలిక శనివారం సాయంత్రం దుకాణానికని వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో పోలీసులకు చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం ఉదయం స్థానికంగా ఉన్న మురికి కాల్వలో బాలిక మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నివేదికలో అత్యాచారం అనంతరం బాలికను గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. 

అయితే ఫిర్యాదు అనంతరం బాలిక ఇంటికి వచ్చిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఆరుగురు పోలీసులపై సస్సెండ్‌ వేటు పడింది. ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ హోంమంత్రి బాల బచ్చన్, ఈ ఘటనకు సంబంధించి బాలిక ఇంటి సమీపంలో నివాసముండే విష్ణు అనే కూలిని అనుమానిస్తున్నామని, అతడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామన్నారు. పలువురు స్థానికులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ పాప కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలిక మృతి మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ‘ మానవత్వం చచ్చిపోతుంది. నీ చిరునవ్వులను చిదిమేసిన దుండగులను వదిలిపెట్టం. చట్టం వారిని వదిలి పెట్టది’  అని ట్విట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

పని చేస్తున్నసంస్థకే కన్నం

నీళ్లనుకుని లైజాల్‌ తాగి...

సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

అల్లుడిని చంపిన మామ

వజ్రాల వాటాలో గొడవ.. అందుకే చంపేశాం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

డ్రైయినేజీలో ఆలయ హుండీలు!

వైద్యం అందక చిన్నారి మృతి

బాబాయిపై అబ్బాయి బండరాయితో దాడి!

సినీ నటి డాటా చోరీ

ఒకరి వెంట ఒకరు..

ఆ బస్సు ఎక్కితే అంతే సంగతులు..!

అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..

ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి

కిలాడీ ‘యాప్‌’తో జర జాగ్రత్త!

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

చికెన్‌ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య

హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ

టైర్‌ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..