కాలువలో వృద్ధురాలి గల్లంతు

20 Jul, 2018 05:44 IST|Sakshi
కాలువ గట్టు వద్ద మహాలక్ష్మి వస్తువులు , ఆకుల మహాలక్ష్మి (ఫైల్‌)

పశ్చిమగోదావరి , తాడేపల్లిగూడెం అర్బన్‌: కాలువలో స్నానానికి దిగిన వృద్ధురాలు ప్రవాహ వేగంలో గల్లంతైన సంఘటన తాడేపల్లిగూడెంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక జువ్వలపాలెం 16వ వార్డుకు చెందిన ఆకుల మహాలక్ష్మి (78) గురువారం వేకువజా మున కాలువకు స్నానానికి వెళ్లింది. వెంట తీసుకెళ్లిన తపాల (చిన్నపాత్ర), కళ్లజోడు, చెప్పులను రేవు మెట్లపై ఉంచి స్నానానికి కాలువలోకి దిగింది. ఆఖరి మెట్టు వద్దకు వెళ్లేసరికి కాలుజారి కాలువలోకి పడిపోయింది. గోదావరికి వరద ప్రభావం ఉండటంతో పట్టణంలోని ఏలూరు కాలువలో నీరు వేగంగా ప్రవహిస్తోంది. మహాలక్ష్మి వృద్ధురాలు కావడంతో నీటి వేగాన్ని తట్టుకోలేక కాలుజారి పడిపోయి ఉంటుందని కుటుం బసభ్యులు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన అగ్నిమాపకశాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు ఆమె ఆచూకీ తెలియరాలేదు. చీకటి పడుతుండటంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. మహాలక్ష్మి భర్త ఏడాది క్రితం మృతిచెందారు. ఆమెకు నలుగురు కుమారులు ఉన్నారు.

అందుబాటులో లేని బోటు
గతంలో ఈత నేర్చుకునేందుకు యువకులు, స్నా నానికి వెళ్లిన పెద్దలు ఏలూరు  కాలువలో కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు సిఫార్సుతో స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయానికి వాటరు బోటు వచ్చింది. చాలాకాలం పాటు సేవలందించిన ఈ బోటు ఇటీవల మరమ్మతుకు గురైంది. దీనిని బాగుచేసేందుకు పూనే నుంచి నిపుణులు రావాల్సి ఉంది. స్థానికంగా మరమ్మతులు చేయడానికి వీలు లేకపోవడంతో ఆ బోటు నిరుపయోగంగా కార్యాలయంలో పడి ఉంది. బోటుకు మరమ్మతులు చేయించా లని ఉన్నతాధికారులకు తెలియజేశామని అగ్నిమాపక శాఖ అ ధికారి వి.సుబ్బారావు తెలిపారు. బోటు అం దుబాటులోకి వస్తే నీటిలో గాలింపు చర్యలు సులభమవుతాయని అగ్నిమాపక సిబ్బంది అంటున్నారు.

మరిన్ని వార్తలు