నకిలీ బంగారంతో రూ.3.77 కోట్ల టోకరా

16 Sep, 2019 07:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: కస్టమర్ల నుంచి స్వీకరించిన బంగారంతో ఓ బ్యాంకు ఉద్యోగి రూ.3.77 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ముంబైలోని ధారావి ఇండియన్‌ బ్యాంకు గోల్డ్‌లోన్‌ విభాగంలో పనిచేస్తున్న రామస్వామి నాడార్‌ ఆ పక్కనే ఓ జువెల్లరీ షాపు నడుపుతున్నాడు.  ఇటీవల బ్యాంకు అధికారులు బంగారం దాచిన 77 పాకెట్లు ఉన్న లాకర్లను తెరిచి చూడగా అది నకిలీ బంగారం అని తేలింది. దీంతో వారు ధారావి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గోల్డ్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్ల నుంచి బంగారాన్ని తనిఖీ చేసి వారికి సర్టిఫికెట్‌ జారీ చేయడం నాడార్‌ పని. అయితే ఆధార్, పాన్‌ కార్డుల ఆధారంగా అతడు 12 మంది నకిలీ కస్టమర్లను సృష్టించాడు. వీరి పేర్లతో నకిలీ బంగారాన్ని  డిపాజిట్‌ చేసి మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు