రవిప్రకాశ్‌పై ఈడీ కేసు నమోదు

2 Jul, 2020 10:33 IST|Sakshi

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసింది. టీవీ9 అసోసియేటెడ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి భారీగా నిధులను రవిప్రకాశ్‌ విత్‌ డ్రా చేయడంతో ఈడీ కేసు నమోదు చేసింది. 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకూ 18 కోట్ల రూపాయల నిధులను రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు విత్‌ డ్రా చేశారని కేసు నమోదు కావడంతో దానిపై విచారణ చేపట్టారు.గతంలోనే ఈ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తో సహా పలువురిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇదే కేసులో ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రవిప్రకాశ్‌ విత్‌ డ్రా చేసిన 18 కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ ఆరా తీయనుంది. కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఏ-1గా రవిప్రకాశ్ ఉన్నారు.

మరిన్ని వార్తలు